తమిళ నటుడు సూర్యకి తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. గజిని సినిమాతో ఇక్కడ కూడ మార్కెట్ సంపాదించుకున్న సూర్య గతకొన్ని రోజులుగా వరుస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. ఆయన చేసిన చిత్రాలకి తెలుగులో సరైన స్పందనే రాలేదు. తమిళంలో సూపర్ హిట్ అనిపించుకున్న చిత్రాలకి కూడా తెలుగులో సరైన ఓపెనింగ్స్ రాలేదంటే ఆయన మార్కెట్ ఎంతలా పడిపోయిందో తెలుసుకోవచ్చు.

 

అయితే ప్రస్తుతం ఆ మార్కెట్ ని తిరిగి గాడిలో పెట్టే పనిలో ఉన్నాడు. సుధ కొంగర దర్శకత్వం వహిస్తున్న ఆకాశం నీ హద్దురా అనే సినిమాతో మళ్లీ మార్కెట్ పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. నిజ జీవితకథతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ పాటికే రిలీజ్ కావాల్సింది. కరోనా వల్ల అన్ని సినిమా రిలీజ్ లు ఆగిపోవడంతో ఇక చేసేదేమీ లేక రిలీజ్ వాయిదా పడింది. మరికొద్ది రోజుల్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితి కనిపించడంతో పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.

 

ఈ సినిమాపై సూర్యకి మంచి నమ్మకం ఉందట. సీనియర్ నటుడు మోహన్ బాబు ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. అయితే సాధారణంగా సూర్య సినిమాలన్నీ అనువాదాలే. ఇప్పటివరకూ ఆయన ఒక్క తెలుగు చిత్రంలోనూ నటించలేదు. తన తమ్ముడు కార్తి తెలుగు నేర్చుకుని మరీ తెలుగు సినిమాల్లో కనిపించినప్పటికీ, సూర్య మాత్రం తెలుగు సినిమాల్లో కనిపించలేదు.

 

అలాగే తనకి తానుగా తెలుగులో డబ్బింగ్ కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు ఆకాశం నీ హద్దురా చిత్రానికి కూడా తెలుగులో వేరే వారిచే డబ్బింగ్ చెప్పిస్తున్నారట. అది మరెవరో కాదు. ఇప్పుడిప్పుడే హీరోగా ఎంట్రీ ఇస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ సత్యదేవ్ అని ప్రచారం జరుగుతుంది. సత్యదేవ్ వాయిస్ సూర్య బాడీ లాంగ్వేజికి బాగా సూటవుతుందని అనుకుంటున్నారట. సినిమా రిలీజ్ అయితేనే గానీ సత్యదేవ్ వాయిస్ ఏ మేరకు మ్యాచ్ అవుతుందో చెప్పలేం..!

మరింత సమాచారం తెలుసుకోండి: