ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని హారర్ సినిమాలలో ఉత్తమ హారర్ చిత్రం ఏమిటని ప్రశ్నిస్తే... 70 శాతం మంది ప్రజలు కాంజురింగ్ అనే చెప్తారు. అప్పుడెప్పుడో 1973 సంవత్సరంలో విడుదలైన ది ఎక్సర్సిస్ట్(The Exorcist) ప్రజలకు గుండెపోటు వచ్చేలా చేసింది అంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమా ప్లై చేసే థియేటర్ల ముందు 2-3 ఆంబులెన్స్ లు పెట్టారంటే అందులోని సన్నివేశాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ సినిమా చిత్రీకరించే సమయంలో కూడా ప్రొడక్షన్ విభాగంలో పనిచేసే వారు చనిపోయారట.


సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటించిన వారు కూడా అంతుచిక్కని రీతిలో మరణించారు. ఆ తర్వాత 1981 వ సంవత్సరంలో ఈవిల్ డెడ్ సినిమా అన్ని భాషలలో విడుదలై హారర్ సినీ ప్రేమికులను బాగా అలరించింది. ఈ సినిమా లో రక్తం, హింసాత్మక సన్నివేశాలు ఎన్నో ఉంటాయి. ఇక ఆ రెండు సినిమాల తర్వాత ఎన్నో హారర్ చిత్రాలు వచ్చాయి కానీ అవి ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందలేదు. మళ్లీ మూడు దశాబ్దాల తర్వాత హాలీవుడ్ లో ద కాంజురింగ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై కోట్ల మంది సినీ అభిమానుల వెన్నులో వణుకు పుట్టించింది. 


ఈ చిత్రంలో ఇద్దరు దంపతులు ఎడ్, లోరైన్ వారెన్ పారానార్మల్ సంఘటన(కార్యాచరణ)లను దర్యాప్తు చేస్తుంటారు. 1971 వ సంవత్సరంలో రోజర్ కారోలిన్ దంపతులు తమ ఐదుగురు పిల్లలతో కలిసి హారిస్ విల్లె, రోడ్ ఐలాండ్ లో ఉన్న ఒక ఫామ్ హౌస్ కి మకాం మారుతారు. వాళ్ళందరూ ఇంట్లో కి వెళితే తమ పెంపుడు కుక్క మాత్రం ఆ ఫామ్ హౌస్ ఏదో చెడు శక్తి ఉందని గ్రహించి పారిపోతుంది. ఆ తర్వాత ఆ ఇంట్లో భయం కల్పించే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ సన్నివేశాలను డైరెక్టర్ జేమ్స్ వాన్ చాలా భయంకరంగా చూపించాడు. నిజానికి తన దర్శకత్వంలో ఎన్నో హాలీవుడ్ హారర్ సినిమాలు విడుదలై బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. కానీ 2013వ సంవత్సరంలో విడుదలైన ద కాంజురింగ్ అతడిని అంతర్జాతీయ డైరెక్టర్ స్థాయికి తీసుకెళ్లింది. స్క్రీన్ ప్లే, మ్యూజిక్ స్కోర్, సినిమాటోగ్రఫీ అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ఈ చిత్రం థియేటర్లలో ఆడి ఉత్తమ హారర్ చిత్రం గా పేరు సంపాదించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: