గ‌త కొన్నేళ్లుగా డ‌బ్బింగ్‌ సినిమాలు తెలుగులో విజయం సాధించడం కష్టంగా మారుతుంది. బాగున్న సినిమాలు కూడా ఇక్కడ ఆడటం లేదు. అయితే వాస్త‌వానికి ఇప్పుడంటే త‌మిళం నుంచి తెలుగుకు వ‌చ్చే డ‌బ్బింగ్ సినిమాల హ‌వా త‌గ్గిపోయింది కానీ, ఒక‌ప్ప‌డు ఆ డ‌బ్బింగ్ సినిమాలు తెలుగు సినీ నిర్మాత‌ల గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తించాయి. ఎందుకంటే.. ఒక‌ప్పుడు తెలుగు సినిమా కంటే త‌మిళం నుంచి డ‌బ్బింగ్ రూపంలో వ‌చ్చిన అనేక సినిమాలు సూప‌ర్ హిట్‌గా నిలిచేవి. ఈ క్ర‌మంలోనే ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్ హాస‌న్‌, అర్జున్‌, విక్ర‌మ్‌, సూర్య‌, ప్ర‌భుదేవా వంటి హీరోల సినిమాలు తెలుగులోనూ క్రేజ్ తెచ్చుకున్నాయి. 

 

అయితే సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తెలుగు స్ట్ర‌యిట్ సినిమాల కంటే ఆయ‌న న‌టించిన త‌మిళ సినిమాల తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్లే తెలుగు ప్రేక్ష‌కుల‌ను బాగా అల‌రించాయి. అలాంటి వాటిలో `ముత్తు` సినిమా కూడా ఒక‌టి.  కె. ఎస్. రవికుమార్ దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం ఒక తమిళ డ‌బ్బింగ్ చిత్రం. ఇందులో రజనీకాంత్, మీనా ప్రధాన పాత్రలలో నటించారు. అక్టోబరు 23, 1995 న విడుదలైన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ పొంది భారీ వసూళ్ళు రాబట్టింది. తమిళనాడులోని కొన్ని థియేటర్లలో 175 రోజులు ఆడి రికార్డులు సృష్టించింది.

 

అంతేకాదు, జపాన్ లో రజనీ కాంత్ క్రేజ్ పెంచింన సినిమా కూడా ఇదే. ఈ మధ్య అడపదడపా భారతీయ చిత్రాలు జపాన్ వెళ్లినా, ఆ దేశం కుర్రకారు ఉలిక్కి పడింది 1998లో. అది రజనీకాంత్ నటించిన ‘ముత్తు’ చిత్రంతో. తమిళసంస్కృతి  పట్ల జపనీయులు మక్కువ పెంచుకోవడం, జపాన్ యువకుల్లో రజనీ మోజు పెరిగిపోవడం అప్పటినుంచే మొదలయింది. ముత్తు సినిమాను ‘ముత్తు ఒడొరు మహారాజా’గా జపాన్ లోవిడుదలయింది. అది సూపర్ హిట్ అయింది. ఆ సినిమా అక్కడ 23 వారాలాడింది.  1.6 మిలియన్ యుఎస్ డాలర్లు వసూలు చేసింది. ఈ క్ర‌మంలోనే అక్క‌డ ర‌జ‌నీ క్రేజ్ అమాంతం పెంచేసింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: