2009లో విడుదలైన 2012 యుగాంతం సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని రకాల ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. జర్మన్ ఫిలిం డైరెక్టర్ రోలాండ్ ఎమెరిచ్ దర్శకత్వంలో జాన్ కుసక్, అమండా పీట్, ఒలివర్ ప్లాట్, తండి న్యూ టౌన్ డాన్ని గ్లోవర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. 2012వ సంవత్సరంలో మాయ నిజం చెప్పిన ప్రకారం యుగాంతం వస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో అద్భుతంగా చూపించి చాలా కోట్లమంది ప్రజలను ఆకట్టుకున్నాడు రోలాండ్ ఎమెరిచ్. 


అయితే ఈ సినిమా కేవలం లాస్ఏంజిల్స్ లో మాత్రమే విడుదల చేయాలని భావించారు కానీ అనుకోకుండా ఒక వెబ్సైట్లో ఈ చిత్రానికి అశేషమైన ఆదరణ లభించడంతో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తే బాగుంటుందని భావించి 2009 నవంబర్ 13వ తేదీన విడుదల చేశారు. భారత దేశ వ్యాప్తంగా కూడా విడుదలైన ఈ సినిమా అనుకున్నదాని కంటే పది రెట్లు ఎక్కువగా ప్రేక్షకాదరణ పొందింది. చదువురాని వారు కూడా ఈ సైంటిఫిక్ ఫిక్షన్ సినిమా చూడడానికి ఆసక్తి చూపారు అంటే అతిశయోక్తి కాదు. తెలుగు ప్రేక్షకులకు కూడా పూర్తిస్థాయిలో అర్థమయ్యే విధంగా నచ్చే విధంగా తీసిన డైరెక్టర్ రోలాండ్ ఎమెరిచ్ ని మెచ్చుకోవాల్సిందే. 


ఈ చిత్రంలో అమెరికా జియాలజిస్ట్(భౌగోళ శాస్త్రజ్ఞుడు) ఆండ్రియాన్ హెంస్లి ఇండియాకి వచ్చి ఆస్ట్రో పీసిసిస్ట్ అయిన సత్నం సురుతాని ని కలసి భూ మధ్య భాగం సూర్యుని అత్యంత శక్తివంతమైన మంట కారణంగా వేడెక్కుతుంది అని తెలుసుకుంటాడు. తర్వాత అతని పరిశోధన గురించి ప్రభుత్వ యంత్రాంగానికి చెబుతాడు. దాంతో వాళ్లంతా అప్రమత్తమై ప్రజలకు భయభ్రాంతులు కలిగించకుండా అందరినీ రక్షించేందుకు రహస్య ప్రాజెక్టును ప్రారంభిస్తారు. లక్ష మంది ప్రజలను సురక్షితం గా తరలించేందుకు 9 ప్రత్యేకమైన వాహనాలను చైనా, ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ, జపాన్, అమెరికా కెనడా దేశాలు తయారు చేయడం మొదలు పెడతాయి. అయితే ఈ ప్రత్యేకమైన వాహనాలలో ఒక సీట్ కి 10 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధంగా ధనికులు యుగాంతం నుండి బ్రతికి బట్టకడతారని ఈ సినిమాలో చూపించబడుతుంది. ఏదేమైనా ఈ సినిమా భారతదేశ వ్యాప్తంగా అందరి ప్రేక్షకులకు బాగా నచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: