అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తర్వాత స్టైలిష్ స్టార్ బన్నీ, సుకుమార్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రంగస్థలం వంటి సూపర్ సక్సెస్ అందుకున్న సుకుమార్ బన్నీతో పాన్ ఇండియా మూవీకి రంగం సిద్ధం చేశాడు.  పుష్ప అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లోనూ రిలీజ్ కానుంది. నిజానికి మొదట ఈ సినిమాని తెలుగులోనే చేద్దామని అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ పాన్ ఇండియా రేంజ్ సినిమా చేద్దామని ఫిక్స్ అయ్యాడు.

 

దాంతో సుకుమార్ ఈ కథకి మరిన్ని మెరుగులు దిద్దుతున్నాడు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ సినిమా పూర్తిగా అడవుల్లోనే చిత్రీకరణ జరుపుకోనుంది. శేషాచలం అడవుల్లో ఆల్రెడీ లొకేషన్ల సెర్చింగ్ కూడా పూర్తయింది. చిత్తూరు ప్రాంత నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువ మంది నటులు అక్కడి వారే కనిపించనున్నారు. ఈ సినిమా కోసం బన్నీ చిత్తూరు యాస కూడా నేర్చుకుంటున్నాడు.

 

అయితే ఐదు భాషలో రిలీజ్ అవనున్న ఈ చిత్రంకోసం బన్నీ ఐదు భాషల్లో డబ్బింగ్ చెప్పనున్నాడనే వార్త వచ్చింది. బన్నీ సినిమాలు తెలుగుతో పాటు మళయాలంలోనూ రిలీజ్ అవుతుంటాయి. అలాంటపుడు మళయాలంలో వేరే వారిచే డబ్బింగ్ చెప్పిస్తారు. కానీ ఈసారి అన్ని భాషల్లో బన్నీయే డబ్బింగ్ చెప్పనున్నాడని అంటున్నారు. బన్నీకి తెలుగుతో పాటు తమిళం కూడా బాగానే వచ్చు.

 

చదువు మొత్తం చెన్నైలోనే సాగింది కాబట్టి తమిళంలో డబ్బింగ్ చెప్పడానికి ఏ ఇబ్బంది ఉండదు. కానీ మిగతా భాషల్లో డబ్బింగ్ చెప్పడం పెద్ద సమస్యగా మారుతుంది. కాబట్టి ఈ వార్త వట్టి పుకారే అయ్యుంటుందని అనుకుంటున్నారు. అదీ గాక ప్రస్తుత పరిస్థితులని చూస్తుంటే, కొత్త భాషలని నేర్చుకుని మరీ డబ్బింగ్ చెప్పేలా లేదు. షూటింగులకి ఎప్పుడు అనుమతి దొరికితే అప్పుడు పని స్టార్ట్ చేద్దామని వెయిట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: