దేశంలో ఇప్పుడు కరోనా వైరస్ వల్ల సామాన్య ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికీ తెలిసిందే.  ఉన్నవాళ్ల పరిస్థితి పక్కన బెడితే దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, చిరు ఉద్యోగుల పరిస్తితి అగమ్య గోచరంగా తయారైంది.  కరోనాని కట్టడి చేసే పనిలో భాగంగా మార్చి 24 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో ఎంతో మంది రోజు వారి కూలీలు ఆకలితో అలమటించిపోయారు.  ఇక సినీ పరిశ్రమ పరిస్థితి కూడా ఇలాగే తయారైంది. షూటింగ్స్ లో  వేశాలు వేసుకొని రోజు గడుపుతున్న జూనియర్ ఆర్టిస్ట్ ల పరిస్థితి చెప్పనలవికాకుండా ఉంది.  అయితే సినీ పెద్దలు కొంత వరకు సహాయం చేసినా ఇల్లు గడవడం కష్టంగా మారిని నటులు తమకు తోచిన పనులు చేస్తు పొట్టపోసుకుంటున్నారు.

 

 

తాజాగా  మొఖానికి రంగు వేసుకొని  కెమెరా ముందు నటించిన ఆ నటుడు ఇప్పుడు మండే ఎండలో పండ్లు అమ్ముతూ జీవనం సాగించాల్సి వచ్చింది.   నటుడిగా ఉన్న సోలంకి దివాకర్‌కు ఈ పరిస్థితి వచ్చింది. ఆయన ముంబైలో పళ్లు అమ్ముతూ కనిపించాడు. లాక్‌డౌన్ దెబ్బతో కుటుంబ పోషణ భారమై ఆ వృత్తి చెప్పట్టినట్టుగా వెల్లడించారు. సోలంకి దివాకర్ ఇండస్ట్రీకి రాక ముందు  పండ్లు, కూరగాయలు అమ్ముకునేవారు.

 

లాక్ డౌన్ కారణంగా సినీ పరిశ్రమ మూత పడిందని.. గతంలో తాను ఈ వ్యాపారమే చేసేవాడినని ఇప్పుడు అది తన కుటుంబాన్ని ఆదుకుంటుందని అన్నాడు దివాకర్.   కాగా బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన డ్రీమ్ గార్ల్ మూవీలో ముఖ్య పాత్ర ఆయన నటించారు. గతంలో  హల్క, హవా, టిట్లీ, కడ్వి హవా, సోంచారియా వంటి సినిమాల్లో కూడా మెప్పించారు సోలంకి దివాకర్‌.  మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభం అయితే నటించేందుకు వెళ్తానని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: