భారతీయుడు టాలీవుడ్ లో ఎంత సంచలన విజయాన్ని నమోదు చేసింది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సినిమా అయినా సరికొత్తగా తెరకెక్కించే దర్శకుడు శంకర్ ఈ సినిమాని తెరకెక్కించారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అటు తమిళంలోనూ ఇటు తెలుగులోనూ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కమలహాసన్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఈ సినిమా. అయితే భారతీయుడు 2 సినిమా ఇప్పటికీ ప్రేక్షకులకు ఎవర్గ్రీన్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ స్టోరీ ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయిపోయింది మరి. 

 


 భారతీయుడు సినిమాలో ద్విపాత్రాభినయం చేసిన కమలహాసన్ అద్భుతంగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించారు. తమిళ డబ్బింగ్ మూవీ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు తెలుగు సినిమా ను ఆదరించిన దానికంటే ఎక్కువగానే  ఆదరించారు ఈ సినిమాని. దీంతో ఈ సినిమా అప్పట్లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి దశాబ్దాలు గడిచిపోతున్నప్పటికీ ఇప్పటికీ సినిమా ఎంతో మందికి ఫేవరేట్ గా  ఉంటుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వృద్ధుడి పాత్ర లో కమల్ హాసన్ నటించిన తీరు ఇప్పటికీ అబ్బుర పరుస్తూనే ఉంటుంది. 

 


 లంచగొండితనాన్ని నిర్మూలించి... భారతదేశాన్ని స్వచ్ఛభారత్ దేశంగా మార్చాలని ఉద్దేశంతో వృద్ధ పాత్రలో నటించిన కమల్ హాసన్ చేసే యాక్షన్ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది అని చెప్పాలి. ఇక తనదైన యాక్షన్ తో  కమలహాసన్ సినిమాలో అద్భుతంగా తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఇక భారతీయుడు సినిమా అటు నిజ జీవితంపై కూడా బాగానే ప్రభావం చూపింది. భారతీయుడు సినిమా తర్వాత కొంతమంది అధికారులు లంచాలు తీసుకోవడానికి వెనకడుగు వేశారు. ఇక వృద్ధుడి పాత్ర లో కమల్ హాసన్ ఒదిగిపోయి నటించిన తీరు అయితే ఇప్పటికి తెలుగు ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. అందుకే తమిళ సినిమా అయినప్పటికీ తెలుగులో కూడా భారీ విజయం సాధించింది ఈ సినిమా. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: