టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు మంచి ఆదరణ ఉంటుంది. కథ బాగుంది అనుకుంటే చాలు సినిమాలను బాగా ఆదరిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా కొందరు హీరోల సినిమాలు ఒకటి హిట్ అయింది అంటే చాలు ఇక అతని హీరో సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇక విజయ్ ఆంటోని అనే హీరో సినిమాల విషయానికి వచ్చి చూస్తే అతని సినిమాల్లో మన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన సినిమా బిచ్చగాడు. ఆ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ప్రేక్షకులకు ఆ సినిమా ఎంత నచ్చింది అంటే తెలుగు హీరోలను చూసి తిట్టారు మన వాళ్ళు. 

 

అతనికి తమిళంలో మంచి స్టార్ ఇమేజ్ ఉంది. అయినా సరే అలాంటి సినిమా చేసాడు. కథ చాలా చాలా బాగా నచ్చింది మన వాళ్లకు. ఇక ఆ సినిమా వసూళ్లు కూడా బాగానే ఉన్నాయి. దీనితో తమిళ హీరోలు తెలుగు మార్కెట్ మీద ఎక్కువగా దృష్టి పెట్టింది కూడా ఆ సినిమా నుంచే అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఆ సినిమా కథను చూసి మన వాళ్ళు కూడా ప్రయోగాలు చెయ్యాలి అనుకున్నా సరే ధైర్యం మాత్రం చాలా మందికి సరిపోలేదు. అందుకే అలాంటి సినిమాలను చేసే అవకాశం వచ్చినా సరే పెద్దగా చేయలేదు. 

 

ఇక విజయ్ తర్వాతి సినిమాలకు మంచి ఆదరణ అనేది వచ్చింది అక్కడి నుంచి. ఆ తర్వాత అతనికి సంబంధించి ఏ సినిమా వచ్చినా సరే చూసారు. రోషగాడు అనే సినిమా కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అతను తెలుగులోనే సినిమా చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇక్కడి హీరో తో కలిసి అతను ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నాడు అని ప్రచారం జరుగుతుంది. మరి చేస్తాడో లేదో...

మరింత సమాచారం తెలుసుకోండి: