ఇప్పుడు టాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీ ఫ్లాట్ ఫాం లో విడుదల అవ్వడానికి సిద్దంగా ఉన్నాయి. చిన్న సినిమాలను ఎక్కువగా ఆక్కడ విడుదల చెయ్యాలి అని చూస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మూడు నాలుగు సినిమాలను అక్కడవిడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని అంటున్నారు. తమిళంలో ఎక్కువ సినిమాలు బాలీవుడ్ లో రెండు మూడు సినిమాలు దానిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక మన తెలుగులో కూడా ఇప్పుడు రెండు సినిమాలను లైన్ లో పెట్టారు. అనుష్క సినిమా అందులోనే విడుదల అవుతుంది అని అంటున్నారు. 


అయితే ఆమె అందుకు అంగీకరించడం లేదు అని అందుకే ఆగారు అని అంటున్నారు. ఇక ఇది పక్కన పెడితే రామ్ హీరో గా వస్తున్న రెడ్ సినిమాను అందులో విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపై ఇప్పుడు గొడవ అవుతుంది అని తన సినిమాను విడుదల చేయవద్దు అని రామ్ అంటున్నాడు అని సమాచారం. అందుకే ఇటీవల చిత్ర నిర్మాతలకు వ్యతిరేకంగా అతను పోస్ట్ పెట్టాడు అని అంటున్నారు. మరి ఏ విధంగా అగోడవ అవుతుంది అనేది చూడాలి. అసలు అతను సినిమా లేట్ అయిన పర్వాలేదు గాని దానిని థియేటర్ లోనే విడుదల చెయ్యాలని స్పష్టంగా చెప్పినట్టు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 

 

ఇప్పుడు ఈ సినిమా విషయంలో రామ్ చాలా ఇబ్బంది పడుతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇక రామ్సినిమా తర్వాత ఒక వెబ్ సీరీస్ లో నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. తమిళ దర్శకుడు ఆ వెబ్ సీరీస్ ని తీసుకొస్తున్నారు. రామ్ మరి ఓటీటీ లో సినిమా ఒప్పుకోకపోతే నిర్మాతలు ఎం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: