టాలీవుడ్ లో ఒకప్పుడు చిరంజీవి అంటే ఒక ప్రభంజనం. అయితే కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండి తిరిగి మళ్ళి సినీ రంగంలో అడుగుపెట్టి వరుస విజయాలతో దూసుకుపోతూ నేటి తరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు చిరు. అయితే గతంలో చేయలేక పోయిన పాత్రలను ఇప్పుడు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే గత పన్నెండేళ్ల నాటి కలను ఇప్పుడు కార్య రూపంలోకి తెచ్చి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవి ఆరు పదుల వయసులోకి ప్రవేశించినా తనదైన నటన, డ్యాన్స్, ఫైట్స్ తో అందరిని అబ్బుర పరుస్తున్నారు.

 

టాలీవుడ్ లో స్వాతంత్ర  సమరయోధులకు సంబంధించి అనేక సినిమాలు వచ్చినా బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన తొలి తెలుగు సమర వీరుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను చేయాలని చిరంజీవి కలను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్  చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను భారీ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమాలో మెగాస్టార్ అద్భుతమైన నటన కనబరిచాడు. ఈ వయసులో కూడా ఆ పోరాట సన్నివేశాలు, గుర్రపు స్వారీ చేయడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమా మొత్తం తన భుజ స్కంధాలపై వేసుకుని నడిపించాడు. డైలాగ్స్ చెప్పటంలో మరొకసారి మెగాస్టార్ అనిపించుకున్నారు.

 

ఇక ఈ సినిమా కోసం పనిచేసిన నిపుణులు అందరు చాలా జాగ్రత్తగా పని చేసారు. దర్శకుడు సురేంద్ర రెడ్డిసినిమా గురించి చెప్పగానే కొంత సమయం కావాలని అడిగాడు. ఎందుకు అనేది సినిమా చూసే ప్రతి వారికి అర్థమవుతుంది. స్వాతంత్ర  ఉద్యమంలో తొలి పోరాటం చేసింది మన తెలుగు వాడే అని అందరికి తెలిసేలా జాతీయ స్థాయిలో ఈ సినిమాను తెరకెక్కించారు. కెమెరా మెన్ విసువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమా చూస్తున్నంతసేపు మనం సినిమాలో ఉన్నామా, లేదా నిజంగా యుద్ధం జరిగే చోట ఉన్నామా అనిపిస్తుంది. ఇక రామ్ చరణ్ తన తండ్రి కలను నెరవేర్చేందుకు ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా ఈ ప్రాజెక్ట్ కి భారీ బడ్జెట్ అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: