హీరో ఎలివేషన్ ను మాస్ యాంగిల్ లో ప్రజెంట్ చేయడంలో పూరిని మించిన డైరక్టర్ లేడంటే అతిశయోక్తి లేదు. పూరితో చేసిన ఏ హీరోకైనా తన డైలాగ్ డిక్షన్, బాడీ లాంగ్వేజ్ మారిపోవడం కామన్. అలా పూరి సినిమాతో తన స్క్రీన్ ప్రెసన్స్ మొత్తం మారిపోయిన హీరో ప్రభాస్. అప్పటివరకూ ఉన్న ప్రభాస్ ను పూర్తిగా మార్చేసిన ఆ సినిమానే ‘బుజ్జిగాడు’. ఈ సినిమా విడుదలై నేటితో 12ఏళ్లు పూర్తి చేసుకుంది. ప్రభాస్ ను పూర్తి మాస్ యాంగిల్ లో పూరి ప్రజెంట్ చేసిన ఈ సినిమా.

IHG

 

సినిమా 2008 మే22న విడుదలైంది. ఇది పూరి సినిమానా.. లేక ప్రభాస్ సినిమానా అంటే చెప్పడం కష్టం. ‘బావున్నావ్ రా.. వాల్వో బస్ లా మాంచి దిట్టంగా ఉన్నావ్’, ‘టిప్పర్ లారీ స్కూటర్ ని గుద్దితే ఎలా ఉంటదో తెల్సా’.. ఇలా పూరి రాసిన ఎన్నో మాసివ్ డైలాగ్స్ ను ప్రభాస్ తన డైలాగ్ డిక్షన్ తో అదరగొట్టేశాడు. మాస్ ఆడియన్స్ కు విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. మోహన్ బాబు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించాడు. కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు, సుప్రీత్ లతో మాసివ్ గ్యాంగ్ స్టర్ కథ తెరకెక్కించాడు పూరి.

IHG

 

ప్రభాస్-త్రిష కాంబలో ఇది మూడో సినిమా. హీరోయిన్ గా త్రిష అందం ఈ సినిమాకు ప్లస్ అయింది. మ్యూజిక్ పరంగా సందీప్ చౌతా అందించిన సాంగ్స్ సూపర్ హిట్టయ్యాయి. అన్నీ మాస్ ట్యూన్స్ ఇచ్చాడు. పూరి తన మార్క్ డైలాగ్స్ ను, టేకింగ్ ను పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్న సినిమా బుజ్జిగాడు. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్. రామారావు ఈ సినిమా నిర్మించారు. మంచి కలెక్షన్లతో పాటు రన్ పరంగా కొన్ని సెంటర్లలో 100 రోజులు ఆడింది.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: