ప్రస్తుతం టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్న నటుడు మహేష్ బాబు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా నీడ సినిమాతో బాల నటుడిగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. దాదాపు 8 సినిమాల్లో కృష్ణ గారి తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయితే చదువు పూర్తి అయిన తర్వాత రాజకుమారుడు సినిమాతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. రాజకుమారుడు తర్వాత వచ్చిన మురారి సినిమాతో  మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాకు గాను మహేష్ అయిదు నెలల పాటు  రోజుకి 12 గంటల  శ్రమించాడు. 

 

తనదైన కోణంలో కొత్తదనాన్ని అందంగా చూపిస్తూ తెర నిండా వెలుగులు నింపగల జీనియస్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్శకత్వంలో తెర కెక్కిన ఈ సినిమా మహేష్ కెరీర్ కి ఒక మైల్ స్టోన్ గా నిలిచింది. సంకల్పం ఓ కల్ప వృక్షం.. మనం ఏది బలంగా కోరుకుంటామో అదే మన చెంతకు వస్తుంది.. నమ్మకమే ఓ ఐరావతం అనే పాయింట్ పై ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో “డుం డుం నటరాజు ఆడాలి” అనే పాట షూటింగ్ చేసేటప్పుడు మహేష్ కి 102 డిగ్రీల జ్వరం అయినా ఆ పాట కోసం వాటర్ ఫైట్ చేసాడు. తెలుగులో డిజిటల్ ఎడిటింగ్ చేసిన రెండో సినిమా మురారి కావడం విశేషం. 

 

అన్నింటికంటే ఈ సినిమాలోని అలనాటి రామచంద్రుడు పాటను మణిశర్మ గారు 65ఏళ్ళ వయసులో జిక్కి గారి చే పాడించడం ఈ సినిమాకు సెన్సేషన్ అయ్యింది. ఈ సినిమాలో ఆర్టిస్ట్ లందరిని  మంచి హేమాహేమీలను తీసుకున్నారు. అయితే ఇందులో బామ్మ పాత్ర కోసం షావుకారు జానకిని సంప్రదించగా ఆవిడ నలభై రోజులు అంటే కష్టం అనడంతో మళయాళ యాక్టర్ సుకుమారి గారి ని ఫైనల్ చేసారు. ఈ సినిమా విడుదల అయ్యాక కలెక్షన్ల వర్షం కురిసింది. నటుడిగా మహేష్ నటన  పీక్స్ కి వెళ్లి కృష్ణ గారి అబ్బాయిలా కాక ప్రిన్స్ మహేష్ గా గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: