టాలీవుడ్ లో అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఆయన సహజంగా మృదు స్వభావి, పక్క వారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటారు. అలాగే కొత్త వారిని ప్రోత్సహిస్తూ చాలా మందికి ఉపాధి కల్పించారు. అయితే అప్పట్లో క్లాస్, మాస్ సినిమాలు చేయడానికి చాలా మంది దర్శకులు ఉన్నా చిరంజీవి ఒక కొత్త దర్శకుడికి అవకాశo  కల్పించి ఇండస్ట్రీలో నిలదోక్కుకునేలా చేసారు. అయితే ఆ సినిమా ఎవరు ఊహించని విధంగా భారీ విజయం సాధించింది. ఆ దర్శకుడే వంశీ. 

 

సాధారణంగా ఏ సినిమాలోనైనా గ్లామర్ అనేది హీరోయిన్ లలోనే చూపిస్తుంటారు దర్శకులు. కాని గ్లామర్ అనేది హీరోయిన్ లే కాదు పిక్చరైజేషన్ లో కూడా ఉంటుందని నిరూపించాడు వంశీ. ఇతని సినిమాలో మామూలు లోకేషన్లు కూడా అందంగా కనపడతాయి. ఇతని మొదటి సినిమా చిరంజీవి, సుహాసిని జంటగా వచ్చిన మంచు పల్లకి. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సాయి చంద్, గిరీష్, నారాయణ రావు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో మంచి కామెడి కూడా ఉంది. ఎం ఆర్ ప్రసాదరావు నిర్మించిన ఈ సినిమాకు యండమూరి వీరేంద్ర నాథ్ రచయితగా మొట్ట మొదటి సినిమా.    

 

అనిల్ ప్రొడక్షన్ సంస్థ తెరకెక్కించిన ఈ సినిమా 1982నవంబర్ 19 న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. పలై వాన సెలై అనే తమిళ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించారు దర్శకుడు వంశీ. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అప్పట్లోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేసింది. అయితే ఈ సినిమా తర్వాత వంశీ, చిరు కాంబినేషన్ లో మరొక సినిమా రాకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.  ఏది ఏమైనా చిరంజీవి నటించిన ఈ సినిమా మంచి ఆట విడుపు సినిమాగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: