టాలీవుడ్ లో నాలుగు దశాబ్దాల పాటు అగ్ర హీరోగా రాణించి అశేష అభిమానులను సంపాదించుకుని తర్వాత అభిమానుల కోరిక మేరకు రాజకీయ రంగంలో అడుగుపెట్టిన నటుడు చిరంజీవి. పది సంవత్సరాల పాటు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన చిరంజీవి ప్రజారాజ్యం అనే సొంత పార్టీ కూడా స్థాపించాడు. అయితే తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ విలీనం అనంతరం చిరు మళ్ళి తనను నటుడిగా నిలబెట్టిన సినీ రంగంలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 

 

చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకుని అగ్ర హీరోగా రాణించారు. అయితే కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండి మళ్ళి  ఖైదీ నెం 150 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. అయితే ఈ సినిమా ఓకే చేయక ముందు చిరు మరొక ప్రాజెక్ట్ ఓకే చేసారు. అది పూరి జగన్నాథ్, చిరంజీవి కాంబినేషన్ లో ఆటో జానీ అనే టైటిల్ తో తెరకేక్కాల్సింది. అయితే ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ పర్లేదనిపించినా సెకండ్ ఆఫ్ నచ్చక చిరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సినీ వర్గాల కథనం. 

 

సెకండ్ ఇన్నింగ్స్ లో మొదటి సినిమా పవర్ ఫుల్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్ గా ఉండాలని, అది బలమైన ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయేలా చేయాలని చిరంజీవి భావించడం వల్ల పూరి సినిమా నుండి తప్పుకున్నట్టు తెలుస్తుంది. అప్పుడే v VINAYAK' target='_blank' title='వి వి వినాయక్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>వి వి వినాయక్ ఇండస్ట్రీలోని టాప్ రైటర్స్ తో కథ రెడీ చేసి చిరూకి వినిపించారు. అది చిరంజీవి అనుకున్న అంచనాలకు దగ్గరగా ఉండటంతో ఆ స్క్రిప్ట్ ని ఓకే చేసారు. కొణిదెల సురేఖ సమర్పణలో వచ్చిన ఈ సినిమాతో  రామ్ చరణ్  తొలిసారి నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: