పవన్ కళ్యాణ్ కి మన తెలుగులో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి ఎందరో దర్శక నిర్మాతలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనకు మన తెలుగులో మంచి క్రేజ్ ఉంది కాబట్టి తమిళ దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడు కొందరు దర్శకులు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన కోసం. ఇప్పుడు మన తెలుగులోనే కాదు ఆయన తమిళంలో కూడా ఒక సినిమాను చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏ సినిమాను చేస్తారు అనేది ఒక సారి చూస్తే... 

 

తమిళంలో ఒక సినిమాను బాలీవుడ్ ది రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్ అజిత్ తో కలిసి ఒక నటిస్తున్నాడు అని వార్తలు వస్తున్నాయి. మరి చేస్తాడా లేదా అనేది చూడాలి. ఇక ఆయన కోసం ఇప్పటికే అక్కడి నిర్మాతలు చర్చలు కూడా జరిపారు అని అంటున్నారు. అగ్ర హీరో కావడం ఆయనకు తెలుగులో మంచి క్రేజ్ కూడా ఉండటం తో ఆయనను తమిళంలో తీసుకోవాలి అని ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇక పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు సినిమాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. 

 

వచ్చే ఏడాది టాలీవుడ్ లో ఆయన మూడు సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇదే క్రమంలో ఆయన తమిళ సినిమాల మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేసారని అంటున్నారు. మరి ఆయన ఏ సినిమా చేస్తారు అసలు అజిత్ తోనే చేస్తారా అనేది తెలియడం లేదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన క్రిష్ తో ఒక సినిమా చేస్తారు. ఆ సినిమా ఇప్పటికే దాదాపుగా మొదలైంది. వచ్చే ఏడాది అది రిలీజ్ కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: