టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. తారక్ తో సినిమా చెయ్యాలి అనుకునే దర్శక నిర్మాతలు కూడా ఎందరో ఉన్నారు మన తెలుగులో. ఇప్పుడు అతను చాలా బిజీ గా ఉన్నాడు. ఇక ఇది పక్కన పెడితే అతనికి ఉన్న క్రేజ్ చూసి బాలీవుడ్ కూడా షాక్ అయింది. అవును నిన్న అతని పుట్టిన రోజు సందర్భంగా అతనికి వచ్చిన ట్వీట్ లు చూసి చాలా మంది బాలీవుడ్ హీరోలు షాక్ అయ్యారు. అతనికి దాదాపు రెండు కోట్లకు పైగా ట్వీట్ లు వచ్చిన సంగతి తెలిసిందే. 

 

వాటి మీదే ఇప్పుడు బాలీవుడ్ లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. అతనికి ఉన్న క్రేజ్ ని చూసి అక్కడి స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారని అతని తో సినిమా చేస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఉంటుంది అని నిన్న ఒక్క రోజే ఆలోచించుకుని నిర్మాతలకు దర్శకులకు ఫోన్ లు చేసిన హీరోలు ఉన్నారని అంటున్నారు. మరి అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని స్టార్ దర్శకులు కూడా అతనికి వచ్చిన క్రేజ్ చూసి షాక్ అయ్యారని సమాచారం. ఇక అతని తో సినిమా చేస్తున్న బన్సాలి కూడా తెలుగులో అతనికి ఉన్న క్రేజ్ చూసి షాక్ అయ్యాడట. 

 

ఈ విధంగా ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ లో స్టార్ లను ఒక్క దెబ్బకు కొట్టాడని ఇండియా లో ఏ హీరో కి కూడా ఈ స్థాయిలో క్రేజ్ రాలేదు ఇంత తక్కువ కాలంలో అని పలువురు కామెంట్ లు కూడా చేస్తున్నారట. ఇప్పుడు అతను ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: