తమిళ హీరో కార్తీ తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఎంతో క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఓ వైపు తమిళ్ లో స్టార్ హీరోగా వెలుగొందుతున్న కార్తీ తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా కార్తీ నటించిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అవుతూ ఉంటాయి. అటు తెలుగులో కూడా ఎంతో మంది ప్రేక్షకులకు కార్తీ ఫేవరేట్ హీరో గా మారిపోయాడు. అయితే కార్తి ఇప్పటికే ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనదైన నటనతో ఆకట్టుకుంటారు అన్న విషయం తెలిసిందే. పాత్రకు తగ్గట్టుగా తనని తాను మార్చుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ  ఉంటాడు హీరో కార్తి. ప్రతి సినిమాలో సరి కొత్తగా కనిపించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. 

 

 అయితే కార్తి హీరోగా తెరకెక్కిన చిత్రం ఖాకీ. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తాడు కార్తీ. అసలు సిసలైన పోలీస్ ఆఫీసర్ అంటే ఎలా ఉండాలి అన్నది ఈ సినిమాలో చూపిస్తాడు. ఇక దొంగల ముఠాను పట్టుకునేందుకు కార్తీ వేసే ఎత్తులు పై ఎత్తులు... అందరినీ ఆకట్టుకుంటాయి. కార్తీ హీరోగా నటించిన ఖాకి సినిమా తమిళంలో మంచి విజయాన్ని సాధించింది. అటు తెలుగులో కూడా ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో కార్తీ సరసన అందాల ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇక రకుల్ కూడా తనదైన అందాల ఆరబోతతో ఈ సినిమాలో ఆకట్టుకుంటుంది. 

 


 ముఖ్యంగా కార్తీ రకుల్ మధ్య ఉండే రొమాంటిక్ సీన్స్ అయితే ప్రేక్షకులను తెగ ఆకర్షిస్తాయి అని చెప్పాలి. ఇక పోలీస్ పాత్రలో కార్తీ గెటప్.... కార్తీ డైలాగ్ డెలివరీ, ఆటిట్యూడ్, డ్రెస్సింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉంటాయి. అందుకే ప్రేక్షకులకు తెగ నచ్చేసింది ఈ సినిమాలో కార్తీ స్టైల్.  అయితే ఇప్పుడు వరకు కార్తీ తెరకెక్కించిన సినిమాలన్ని  ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినవే. ఇక కార్తి హీరోగా నటించిన ఖాకీ సినిమా... యధార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఓ వైపు తన టీమ్ ని  కాపాడుకుంటూనే మరోవైపు దొంగలను తనదైన  వ్యూహాలతో ఎలా పట్టుకుంటాడు అన్ని  ఈ సినిమాలో ఎంతో ఆసక్తికరంగా మారిపోతూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: