శ్రీదేవి .. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. అంతలా అభిమానులను సంపాదించుకుంది ఈ అతిలోక సుందరి. బాల్యంలోనే సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి అందం, అభినయం తో ప్రేక్షకులను మంత్రం ముగ్ధులను చేసింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన దగ్గర నుండి దాదాపు అందరు అగ్ర హీరోలతోను జత కట్టి విశేష ఆదరణ పొందింది. ఆమె తన కెరీర్ లో ఎన్నో హిట్స్ అందుకుంది. అంతేకాక ఆమెను లేడి సూపర్ స్టార్ అని కూడా అనే వారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఇంకా అనేక అవార్డులు వరించాయి. అయితే తెలుగులో చిరంజీవి తో కలిసి నటించిన రాణి కాసుల రంగమ్మ సినిమాకు తొలి సారి ఆమె డ్యుయల్ రోల్ చేసింది. 

 

చిరంజీవి, శ్రీ దేవి కలిసి జంటగా1981 లో  అనిల్ ప్రొడక్షన్ సంస్థ నిర్మించిన  సినిమా రాణికాసుల రంగమ్మ. టి v prasad OLD' target='_blank' title='ఎల్ వి ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>ఎల్ వి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ దేవి ద్వి పాత్రాభినయం తో అలరించింది. అచ్చమైన పల్లెటూరి పిల్ల రాణి కాసుల రంగమ్మగా ఒక పాత్రలో చాలా అమాయకంగా ఉంటే, మరొక పాత్రలో సిటి లో చదువుకునే మోడ్రన్ అమ్మాయి రోజా గా కనిపిస్తుంది. అయితే ఈ సినిమాలో సీనియర్ నటుడు జగ్గయ్య, రాళ్ళపల్లి, నూతన ప్రసాద్ వంటి వారు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి సంగీతం చక్రవర్తి అందించారు. 

 

సంగీత పరంగా ఈ సినిమా మంచి గుర్తింపు వచ్చినా కథాంశం పరంగా కాస్త బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అయితే ఈ సినిమాలో చిరంజీవి, శ్రీ దేవి నటనకు గాను విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. అయితే ఈ సినిమాలో రెండు పాటలు మాత్రం ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. అవి అందంగా ఉన్నాను రామా…, తూరుపునా సాగింది తుమ్మెదల వేటా… అంటూ సాగే నేపధ్య గానం ప్రేక్షకుల మనసులలో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: