సినీ పరిశ్రమలో ఎంతటి స్టార్ హీరోలైనా ఒకానొక సమయంలో పరాజయాలను చవి చూడక తప్పదు. టాలీవుడ్ అగ్ర హీరోగా నాలుగు దశాబ్దాల నుండి కొనసాగుతున్న హీరో చిరంజీవి. 80, 90 లలో విభిన్న తరహా పాత్రలతో మంచి గుర్తింపు పొందినా తర్వాత కొంత కాలం చిరంజీవి సినిమాలు అంతగా విజయవంతం కాలేదు. తర్వాత మళ్ళి హిట్ ట్రాక్ లోకి వచ్చాడు. అయితే కెరీర్ ప్రారంభం లో కొంత ఒడిదుడుకులు ఎదుర్కున్నారు. అప్పటి వరకు కూడా చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రలు పోషించారు. 

 

అయితే చిరంజీవి కెరీర్ లో అతి పెద్ద డిజార్తర్ గా ఉన్న సినిమాలలో జాతర ఒకటి. 1980 లో సత్యం డైరెక్షన్ లో వచ్చిన జాతర సినిమా చిరంజీవి కెరీర్ లో ఘోర పరాజయం పాలైనది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రీదేవి నటించింది. ఈ సినిమా డ్రామా ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. ఈ సినిమాలో విలన్ గా నాగభూషణం నటించారు. పి యల్ నారాయణ, లీలావతి, ప్రసాద్ బాబు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఎంత హిట్ ఫెయిర్ లు నటించినా అప్పుడప్పుడు ఇలాంటి డిజార్తర్ లను ఎదుర్కోక తప్పదు అని ఈ సినిమా ద్వారా తెలుస్తుంది. 

 

 

సినిమా తర్వాత చిరంజీవి కెరీర్ బ్యాలెన్స్ తప్పిందనే చెప్పాలి. అయితే తర్వాత వచ్చిన సినిమాలతో మళ్ళి ట్రాక్ లోకి వచ్చారు. ఇక దాని తర్వాత వీరి కాంబినేషన్  లో వచ్చిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా భారీ విజయాన్ని అందించింది. ఈ సినిమాకు చిరంజీవి ఒక కొత్త లుక్ తో ప్రేక్షకులను ఆకర్షించాడు. ఇక శ్రీ దేవి తన కాస్ట్యుమ్స్ తనే డిజైన్ చేయించుకుంది. సంగీత పరంగా ఈ సినిమా ఇప్పటికి ఎవర్ గ్రీన్ సినిమానే.

మరింత సమాచారం తెలుసుకోండి: