విక్టరీ వెంకటేశ్ లో యాక్షన్ మోడ్ ఎంత ఉంటుంతో ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే నటన కూడా అంతే ఉంటుంది. ప్రేమకథలు, యాక్షన్, ఫ్యామిలీ కంటెంట్ లకు వెంకటేశ్ సరిగ్గా సరిపోతాడు. వెంకటేశ్ కు మహిళా ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం కల్పించిన సినిమా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’. కుటుంబ కథలను పర్ఫెక్ట్ గా తీయడంలో ఆరితేరిన ఈవీవీ సత్యనారాయణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ అయింది. ఈ సినిమా విడుదలై నేటితో 24 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

వెంకటేశ్, సౌందర్య, వినీత ముఖ్యపాత్రల్లో నటించిన ఈ సినిమా 1996 మే 22న విడుదలైంది. తమిళ్ లో వచ్చిన ‘థైకులమే.. థైకులమే’ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. భాగ్యరాజ్ కథ అందించారు. తెలుగు నేటివిటీకీ తగ్గ పూర్తి మార్పులు చేసి ఈవీవీ తెరకెక్కించారు. సినిమాలో కీలక పాయింట్ కు తెలుగుకు తగ్గట్టు కామెడీ ట్రాక్ నడిపించి మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. కామెడీ, సెంటిమెంట్ సమపాళ్లలో ఉండడంతో ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది, ముఖ్యంగా మహిళల ఆదరణ దక్కింది. భార్య దగ్గరే మరో భార్యను ఉంచి చెప్పుకోలేక ఇబ్బంది పడే పాత్రలో వెంకటేశ్ నటన అద్భుతమని చెప్పాలి.

IHG

 

సినిమాలో కోట శ్రీనివాసరావు పాత్ర కీలకం. ఇంత సెంటిమెంట్ కథకు బ్రహ్మానందం, ఏవీఎస్ తో అద్భుతమైన కామెడీ పండించడం ఈవీవీకే చెల్లింది. సౌందర్య ఈ సినిమాలో తన నటనలో ఉన్న స్థాయిని ప్రదర్శించింది. కోటీ స్వరపరచిన పాటలు ఆకట్టుకుంటాయి. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కె.ఎల్. నారాయణ, ఎస్. గోపాల్ రెడ్డిసినిమా నిర్మించారు. మంచి ప్రేక్షకాదరణతో ఈ సినిమా శతదినతోత్సవం జరుపుకుంది. వెంకటేశ్ కెరీర్లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: