అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా తెరంగేట్రం చేసిన నాగార్జున అప్పట్లో యూత్ ఐకాన్. స్టైలిష్ సినిమాలు, ప్రేకథలు, యాక్షన్ మూవీస్ తో యువ సామ్రాట్ గా ఎదిగిపోయాడు నాగార్జున. అయితే.. నాగార్జునలో మరో కోణాన్ని ఆవిష్కరించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు. నాగార్జునతో ఆఖరిపోరాటం వంటి యాక్షన్ మూవీ తీసిన రాఘవేంద్రరావు తెరకెక్కించిన ఆధ్యాత్మిక సంచలనం ‘అన్నమయ్య’. నాగార్జున అసలు ఈ క్యారెక్టర్ కు సరిపోతాడా, జనం చూస్తారా, ఈరోజుల్లో ఈ సినిమా ఆడుతుందా అనే ప్రశ్నలకు తిరుగులేని సమాధానం చెప్పింది ఈ సినిమా. నేటితో ఈ సినిమా విడుదలై 23 ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1997 మే 22న విడుదలై అఖండ విజయం సాధించింది. సినిమా విడుదలైన ప్రతి థియేటర్ ఓ ఆధ్యాత్మిక క్షేత్రమై పోయింది. నాగార్జునలో ఆస్థాయి నటనను గానీ.. రాఘవేంద్రరావు నుంచి ఇంతటి ఆధ్యాత్మికను కానీ ఊహ మాత్రంగానైనా ఆలోచించలేదు ప్రేక్షకులు. కానీ ఈ సినిమా ప్రేక్షకులందరినీ అద్భుతానికి గురి చేసింది. జేకే భారవి రచన, కీరవాణి సంగీతం, వేటూరి సాహిత్యం, విన్సెంట్ ఫొటోగ్రఫీకి రాఘవేంద్రరావు దర్శకత్వం తోడై ఈ సినిమా నేటికీ ఓ ఆధ్యాత్మిక గ్రంధంగా మిగిలిపోయింది.

IHG

 

కీరవాణి స్వరపరచిన ప్రతి పాట ఓ ఆణిముత్యమని చెప్పాలి. తిరుమల శ్రీనివాసుడి పాత్రలో సుమన్ జీవించారు. రమ్యకృష్ణ, రోజా, భానుప్రియ, శ్రీకన్య, కస్తూరి, మోహన్ బాబు, రోజా, కోట, తనికెళ్ల భరణి.. ముఖ్యపాత్రలు పోషించారు. వీఎంసీ బ్యానర్ పై వి.దొరస్వామిరాజు నిర్మించిన అన్నమయ్య బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. రెండు దశాబ్దాల క్రితం ఈ సినిమా వచ్చినా అప్పటికి ఆధ్యాత్మిక సినిమాలు చూసే ట్రెండ్ లేదు. కానీ ఈ సినిమా ఏకంగా 76 సెంటర్లలో 100 రోజులు, 15 సెంటర్లలో 175 రోజులు రన్ కావడం విశేషం.

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: