టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ లో ఇప్పుడు విలక్షన నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్ సేతుపతి.  కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు విజయ్ సేతుపతి.  సుందరపాండియన్ సినిమాలో విలన్ గా నటించిన తర్వాత 2012 లో పిజ్జా మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  నాడువుల కొంజం పక్కా కనోమ్ తనకంటూ మంచి ఇమేజ్ సంపాదించుకున్నాడు విజయ్ సేతుపతి.  ఆ తర్వాత మెల్లి మెల్లిగా ఇతర భాషల్లో క్యారెక్టర్, విలన్ పాత్రల్లో నటిస్తూ వస్తున్నాడు.  గత ఏడాది సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నించిన ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో ముఖ్య భూమిక పోషించాడు.  ఇలా వరుసగా విజయ్ సేతుపతికి కలిసి రావడంతో తన పారితోషికం పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా వస్తున్న వైష్ణవ్ తేజ్ నటిస్తున్న ‘ఉప్పెన’ మూవీలో విలన్ గాన నటిస్తున్నాడు.

 

ఇలా తెలుగులో వరుస ఆఫర్లు వస్తుండడంతో విజయ్ సేతుపతి తన పారితోషికాన్ని భారీగా పెంచేశాడట. ప్రస్తుతం సినిమాకి 10 కోట్లు అడుగుతున్నట్టు టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. అయితే, అతనికే అంత ఇస్తే ఇక బడ్జెట్టు విపరీతంగా పెరిగిపోతుందని ఆయా నిర్మాతలు భావిస్తున్నారట. అయితే మనోడు మాత్రం ఎక్కడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్ వినిపిస్తున్నా అఫిషయల్ గా మాత్రం ఈ నటుడు ఎలాంటి విషయాన్ని తన రెమ్యూనేషన్ విషయంలో మాట్లాడలేదు.  

 

ఓ మాదిరి బడ్జెట్టు సినిమా నిర్మాతలే కాకుండా, స్టార్స్ తో నిర్మించే భారీ చిత్రాల నిర్మాతలు కూడా అంత మొత్తం ఇవ్వడానికి సుముఖంగా లేరని సమాచారం. మరి, ఇప్పుడైనా ఆయన పారితోషికాన్ని తగ్గించుకుంటాడేమో చూడాలి.  ప్రస్తుతం కరోనా కష్టాలతో సినీ పరిశ్రమ ఎన్ని ఇబ్బందులు పడుతుంతో అందరికీ తెలిసిందే.  ఇలాంటి సమయంలో విజయ్ సేతుపతి ఇలాటి నిర్ణయం తీసుకుంటారా అబ్బే ఇవన్నీ ఒట్టి పుకార్లు మాత్రమే అంటూ ఆయన ఫ్యాన్స్ కొట్టి పడేస్తున్నారు.  నిజమే ఈ కరోనా కష్టాల వల్ల ఎంతో మంది స్టార్లు తమ రెమ్యూనరేషన్ తగ్గించుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: