టెలివిజన్ రంగంలో కొన్ని రియాల్టీ షోలు ఎంతో ఊర్రూతలూగిస్తుంటాయి.  తెలుగు లో జబర్ధస్త్ కార్యక్రమం ఎంతగా అలరిస్తుందో అందరికీ తెలిసిందే.  గతంలో పలు కామెడీ సీరియల్స్, ఇతర కార్యక్రమాలు వచ్చినా.. జబర్ధస్త్ ని మాత్రం డామినేట్ చేయలేకపోతున్నాయి. ఇక బాలీవుడ్ బుల్లితెరపై క‌మెడీయ‌న్ క‌పిల్ శ‌ర్మ పాపుల‌ర్ షో ది క‌పిల్ శ‌ర్మ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. మనోడు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రిస్తారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కపిల్ శర్మ కామెడీ పరంగా ఎంత గొప్పగా అలరిస్తుంటాడో.. తన నోటి దూలతో అంతే వివాదాల్లో చిక్కుకుంటారు.  తాజాగా ఆయ‌న కొందరి మ‌నోభావాలు దెబ్బతీసేలా మాట్లాడ‌గా, వారు ఆయ‌నపై కేసు పెడ‌తామ‌ని హెచ్చ‌రించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌క త‌ప్ప‌లేదు. క‌పిల్ శ‌ర్మ మార్చి 28న ప్ర‌సార‌మైన ది క‌పిల్ శ‌ర్మ షోలో చిత్ర గుప్తుడి అప‌హాస్యం చేస్తూ మాట్లాడారు.

 

తమ ఆరాధ్య దైవమైన చిత్రగుప్తుడి గొప్పతనాన్ని క‌పిల్ త‌క్కువ‌గా చేశాడంటూ కాయస్థ సామాజిక వర్గం మండి ప‌డింది. ఇంకేముంది ఈ విషయం కాస్త సోషల్ మీడియా సాక్షిగా రచ్చ రచ్చ అయ్యింది. దాంతో ఆయ‌న క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని కూడా డిమాండ్ చేసింది. లేని పక్షంలో కపిల్‌ శర్మను బాయ్‌కాట్‌ చేయడంతో పాటుగా.. అతడిపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేస్తామని హెచ్చరించారు.  ఆ దెబ్బతో కపిల్ శర్మ దిగి రాక తప్పలేదు. 

 

దాంతో ‘ప్రియమైన కాయస్థ సమాజానికి నమస్కారం. మే 28న ప్ర‌సార‌మైన ది క‌పిల్ షో కార్య‌క్ర‌మంలో చిత్రగుప్తుడిపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరుతున్నా. ఎవ‌రి మనోభావాలను కించపరిచే ఉద్దేశం మాకు లేదు. అంద‌రు ఎల్లప్పుడూ సంతోషంగా, క్షేమంగా నవ్వుతూ ఉండాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నా. హృదయపూర్వక నమస్కారాలు’’ అంటూ తన సోషల్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పటికి ఈ వివాదం సర్ధుమణిగినట్టేనా లేద అన్నది భవిష్యత్ లో తెలియాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: