మహేష్ బాబు టాలీవుడ్ సూపర్ స్టార్. ఆయన లేటెస్ట్ హిట్ సరిలేరు నీకెవ్వరు. నిజంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మహేష్ బాబుకు ఆప్ట్ అయ్యే టైటిల్ నే పెట్టారని ఫ్యాన్స్ నుంచే కాదు అందరి నుంచి ఏకగ్రీవంగా పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయి మహేష్ కెరీర్లో మరో మెట్టు ఎక్కించింది.

 

సరే మహేష్ ఆ తరువాత రెండు కధలు విన్నారు. ఇద్దరు డైరెక్టర్లను లైన్లో పెట్టారు. ఆ ఇద్దరిలో వంశీ ఒకరు అయితే, ఇపుడు మహేష్ బాబు పరశురాం డైరెక్షన్లో సినిమాను పట్టాలెక్కించబోతున్నారు. ఈ సినిమా లాంచింగ్ ఈ నెల 31వ తేదీన జరుగుతుందిట. అంటే ఆ రోజుకు ఒక విశేషం ఉంది  సూపర్ స్టార్ క్రిష్ణ  పుట్టిన రోజు.

 

మూవీ ప్రారంభోత్సవానికి ఆ డేట్ ని కంఫర్మ్ చేయడం ద్వారా క్రిష్ణ సెంటిమెంట్ ని మరోమారు మహేష్ ముందుకుతెచ్చారు సరే ఈ సినిమాకు అదిరిపోయే కధనే పరశురాం సిధ్ధం చేశారని అంటున్నారు. గీతాగోవిందం వంటి టాప్ మోస్ట్ హిట్ మూవీ తరువాత పరశురాం మహేష్ బాబుతో తీస్తున్న మూవీ ఇది.

 

మూవీ విషయంలో అపుడే పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఇక ఈ మూవీలో హీరోయిన్లుగా కూడా బాలీవుడ్ తారల పేర్లు వినిపిస్తున్నాయి. మహేష్ బాబు తో సెట్ అయ్యే వారు ఎవరో సెలెక్ట్ చేసి మరీ యూనిట్ రెడీ చేసి  పెట్టుకుందని టాక్ ఉంది. అయితే దాన్ని షూటింగ్ ప్రారంభం వేళ మాత్రమే రివీల్ చేస్తారని అంటున్నారు. 

 

ఇదిలా ఉండగా మహేష్ బాబు ఈ మూవీలో తన సిక్స్ ప్యాక్ బాడీ షేప్ చూపిస్తారా అన్న చర్చ కూడా మరో వైపు సాగుతోంది. ఏది ఏమైనా ఈ మధ్య లాక్ డౌన్ వేళ మహేష్ తన ఇంట్లో స్విమ్మింగ్ పూల్లో ఓపెన్ టాప్ బాడీతో స్విం చేస్తున్న పిక్స్ ని సోషల్ మీడియాకు రిలీజ్ చేసి ఫ్యాన్స్ మెప్పు సాధించాడు. మహేష్ బాబు సూపర్ బాడీ బిల్డర్ అని, ఇకపై సినిమాల్లో అయినా షర్ట్ విప్పి కెవ్వు కేక పెట్టించమని కూడా ఫ్యాన్స్ కోరారు మరి వారి కోరికను పరశురాం తీరుస్తాడా. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: