వరసగా నాలుగు డిజాస్టర్లు  వచ్చినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు యంగ్ హీరో నాగ శౌర్య. రెండేళ్ల క్రితం ఛలోతో సూపర్ హిట్ కొట్టాడు అంతే ఆతరువాత  ఈహీరో వరుస పరాజయలను ఖాతాలో వేసుకున్నాడు. ఇటీవల అశ్వథ్థామ కూడా శౌర్య కు విజయాన్ని అందించకలేకపోయింది. అయితే ప్లాప్ లతో సావాసం చేస్తున్న కూడా వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.అందులో భాగంగా ప్రస్తుతం శౌర్య , శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమాలో నటిస్తున్నాడు. ఇటీవలే సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈచిత్రంలో మాళవిక నాయర్ హీరోయిన్ గా నటిస్తుంది.
 
ఈ సినిమాతో పాటు శౌర్య ప్రస్తుతం లక్ష్మి సౌజన్య డైరెక్షన్ లో ఓ చిత్రంలో నటిస్తున్నాడు.పెళ్ళి చూపులు ఫేమ్ రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తుండగా సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తుంది. ఇక ఇవే గాక సుబ్రహ్మణ్యపురం ఫేమ్ సంతోష్ జాగర్లపూడి డైరెక్షన్ లో కూడా నటించనున్నాడు గత ఏడాదే ఈ సినిమా లాంచ్ కూడా అయ్యింది. ఏషియన్ సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తం గా ఈచిత్రాన్ని నిర్మించనున్నాయి. అలాగే  mahesh KONERU' target='_blank' title='మహేష్ ఎస్ కోనేరు -గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మహేష్ ఎస్ కోనేరు నిర్మాణంలో నూతన దర్శకుడు రాజాతో  నాగ శౌర్య సినిమాకు కమిట్ అయ్యాడు.  
 
ఇక తాజాగా నాగ శౌర్య మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. అలా ఎలా ఫేమ్ హవీష్ కృష్ణ  డైరెక్షన్ లో నటించడానికి శౌర్య ఓకే చెప్పాడట. ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాగ శౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ నిర్మించనుంది. త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: