మన తెలుగులో ఇప్పుడు కొందరు హీరోలు అభిమానులకు కొత్తగా కనపడే ప్రయత్నాల్లో భాగంగా బరువు తగ్గడం... బరువు పెరగడం వంటి కార్యక్రమాలను చేస్తున్నారు. తాము ఎంత కొత్తగా ఉంటే అభిమానులు తమను అంత కొత్తగా ఆదరిస్తారని తమ మార్కెట్ ఇతర భాషల్లో కూడా పెరిగే అవకాశం ఉంటుంది అని భావిస్తున్నారు హీరోలు. మారుతున్న ప్రేక్ష‌కుడి అభిరుచికి త‌గ్గ‌ట్టుగానే న‌టించాల్సి ఉంది. ఇందుకు అనుగుణంగానే వారు త‌మ భాష‌, వేష‌, ఆహార్యం కూడా మార్చు చేసుకోవాల్సిన ప‌రిస్థితి అయితే వ‌స్తోంది. ఈ నేపధ్యంలోనే టాలీవుడ్ స్టార్ హీరో ఒకరు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారని సమాచారం.



ఆయనకు వాస్తవానికి బట్ట తల... ఇప్పటి వరకు ఆయన ఏ సినిమాలో కూడా ఆ విధంగా కనపడిన సందర్భం లేదు. అయితే ఇప్పుడు రాబోయే సినిమాల్లో ఆయన బట్టతల తో కనపడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. నిజం ఎంతో గాని ఆయన రెండు సినిమాలను అదే విధంగా చేసే సూచనలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. త్వరలోనే ఆయన లుక్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.


ఆయన ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్ధమై ఉంటుంది కదా...? ఆయనే నందమూరి బాలకృష్ణ. ఇక వయసు కి తగిన విధంగా పాత్రలు చెయ్యాలని భావిస్తున్న ఆయన ఇప్పుడు ఆ విధంగా ప్రయత్నాలు చేస్తూ తనకు విగ్ లేకుండా నటించే ఆసక్తి ఉందని రాబోయే సినిమాల్లో ఆ విధంగా కనపడతాను అని చెప్పినట్టు సమాచారం. దీనికి దర్శకుడు కూడా ఓకే చెప్పారని ఆయన కథ కూడా సిద్దం చేసుకున్నారు అని తెలుస్తుంది.



ప్ర‌స్తుతం బాల‌య్య బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలోనూ ఇదే లుక్‌తో ఉంటాడ‌ని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ కంటిన్యూగా పూర్తి చేసి వ‌చ్చే యేడాది ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: