ఇప్పుడు కొందరు హీరోయిన్ లు అవకాశాల కోసమని ఏ విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క అవకాశం వస్తే చాలు అనుకునే స్థాయిలో చాలా మంది హీరోయిన్ లు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు కొందరు హీరోయిన్లు తమ స్థాయి తగ్గించుకుని చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రధానంగా రకుల్ ప్రీత్ సింగ్ ముందు వరుసలో ఉందని తెలుస్తుంది. అప్పుడెప్పుడో సందీప్ కిష‌న్‌, మంచు మ‌నోజ్‌, ఆది లాంటి హీరోల ప‌క్కన న‌టించి.. కెరీర్ ఆరంభంలోనే వ‌రుస హిట్ల‌తో మంచి స్వింగ్‌లోకి వ‌చ్చిన ర‌కుల్ ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి స్టార్ హీరోల సినిమాలు చేసింది.

 

స్టార్ హీరోల‌తో సినిమాలు చేస్తోన్న టైంలో ర‌కుల్ ప‌ట్టిందల్లా బంగారం అన్న‌ట్టుగా ఉండేది. ఆమె తెలుగులోనే కాదు.. అటు త‌మిళ్‌లోనూ స్టార్ హీరోల ప‌క్క‌న ఛాన్సులు కొట్టేసి మంచి స్టార్ డ‌మ్ ఎంజాయ్ చేసింది. రెండేళ్ల పాటు ఆమెకు ఆడింది ఆట‌గా... పాడింది పాట‌గా మారింది. ఆ త‌ర్వాత కెరీర్ ప‌రంగా వేసిన రాంగ్ స్టెప్పులే ఆమెను కింద‌కు దించేశాయి. ఆమె బాలీవుడ్ మీద దృష్టి పెట్టి అక్కడి ప్రయత్నాలను ఎక్కువగా చేసినా సరే పెద్దగా అవకాశాలు మాత్రం ఆమెకు రాలేదు అనే చెప్పాలి. ఆ త‌ర్వాత ఇక్క‌డ‌కు తిరిగి వ‌చ్చినా ఆమెను ప‌ట్టించుకున్నోళ్లు లేరు.

 

ఈ నేపధ్యంలోనే ఆమె తెలుగులో ఒక చిన్న హీరోతో కూడా సినిమా చేస్తాను అని చెప్పినట్టు తెలుస్తుంది. తనకు అవకాశం ఇవ్వాలని ఆమె కోరినట్టు సమాచారం. అదే విధంగా తనకు గ్లామర్ గాని పారితోషికం గాని ఎక్కువగా అవసరం లేదని ఆమె చెప్పినట్టు సమాచారం. తనకు పెద్దగా కోరికలు ఏమీ లేవని... దయచేసి చిన్న హీరోల పక్కన అయినా సరే సినిమాలు చేస్తాను అని చెప్పినట్టు సమాచారం. ఒక స్టార్ దర్శకుడ్ని కలిసిన ఆమె ఒక్క అవకాశం వచ్చినా సరే చాలు అనుకునే విధంగా వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది. మరి ఆ దర్శకుడు అవకాశం ఇస్తాడా లేదా అనేది చూడాలి. ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క సినిమా మాత్రమే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: