తమిళ హీరోల సినిమాలు అనగానే మన తెలుగులో ఎక్కడ లేని ఆనందం ఉంటుంది. వారి సినిమాలను ఇక్కడ విడుదల చేయడానికి ముందు నుంచి కూడా ప్రయత్నాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మార్కెట్ కూడా భారీగా పెరిగిన నేపధ్యంలో సినిమాలు ఇక్కడ ఎక్కువగా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక మన తెలుగులో రజని కాంత్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. తెలుగులో ర‌జ‌నీ కాంత్ సినిమాల‌కు ఉన్న క్రేజ్ ఈ నాటిది కాదు.. దాదాపు న‌ల‌భై ఏళ్ల క్రితం నుంచే ర‌జ‌నీ కాంత్ సినిమాలు మ‌న తెలుగులో రిలీజ్ అవుతూ వ‌స్తున్నాయి.

 

ఒకానొక ద‌శ‌లో ర‌జ‌నీ సినిమాలు మ‌న తెలుగు స్టార్ హీరోల సినిమాల‌ను మించి వ‌సూళ్లు రాబ‌ట్టాయి. కాని ఆయన సినిమాలను ఇప్పుడు చూసే పరిస్థితి దాదాపుగా లేదు అని సమాచారం. వ‌రుస ప్లాపుల‌తో ర‌జ‌నీ మార్కెట్‌ డిజాస్ట‌ర్ అవుతోంది. ఈ తరుణంలో ఇక నుంచి జాగ్రత్తగా సినిమాలు చేసి తెలుగులో కూడా మార్కెట్ ని పెంచుకోవాలని రజని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమాలో లేదా మరో హీరో సినిమాలో ఆయన ఒక పాత్ర చేసే అవకాశం ఉందని సమాచారం. మెగా ఫాన్స్ సినిమా చూస్తే మంచి వసూళ్లు వస్తాయి. 

 

అందుకే చిరంజీవి కి ఉన్న క్రేజ్ తెలిసిన ఆయన ఒకప్పటి మార్కెట్ ని తిరిగి తెచ్చుకునే విధంగా అడుగులు వేస్తున్నారు. గ‌తంలో ర‌జ‌నీ కాంత్ తెలుగులో త‌న ఆప్త‌మిత్రుడు అయిన పెద‌రాయుడు సినిమాలో న‌టించారు. ఆ సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ అవ్వ‌డంతో పాటు ఎన్నో రికార్డులు తిర‌గ‌రాసింది. ఇక ఇప్పుడు చిరు తో అయినా త‌న మార్కెట్ పెంచుకోవాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. మ‌రి ర‌జ‌నీ ఏ సినిమాలో నటిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతం చిరంజీవి సినిమా ఒకటి లాక్ డౌన్ కారణంగా ఆగిపోయింది. లూసిఫర్ అనే సినిమాలో చిరంజీవి నటిస్తారు. ఆ సినిమాలో రజని కనపడే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: