టాలీవుడ్ లో ఎంతో మంది కొత్తవాళ్ళు హీరోలుగా.. హీరోయిన్స్ గా వస్తున్నారు. అయితే చాలామంది ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. అందరికి స్టార్ ఇమేజ్ రావడం లేదు. ఆర్ ఎక్స్ 100 లాంటి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా పాపులర్ అయిన రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ ఆ తర్వాత ఆ క్రేజ్ ని కంటిన్యూ చేయలేకపోయిది. చేయడానికి విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ తో సినిమాలు చేసింది గాని...మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అన్న ట్యాగ్ మాత్రం రాలేదు.

 

అయితే ఇలాగే కొంతమంది బుల్లితెర యాంకర్స్ కూడా హీరో హీరోయిన్స్ గా పాపులర్ అవ్వాలని స్టార్స్ గా క్రేజ్ దక్కించుకోవాలని తాపత్రయపడుతున్నారు. రష్మీ గౌతం హీరోయిన్ గా గుంటూరు టాకీస్ సినిమా చేసింది. బోల్డ్ గా నటించి మంచి పేరు దక్కించుకుంది. ఆ సినిమా పరవాలేదు అనిపించుకుంది. కాని వరసగా హీరోయిన్ అవకాశాలే రాలేదు. ఆ తర్వాత చేసిన ఒకటి రెండు సినిమాలు రష్మీ కి హీరోయిన్ క్రేజ్ తెచ్చిపెట్టలేదు. ఇక అనసూయ హీరోయిన్ గా చేయనప్పటికి రంగమ్మత్త లాంటి అద్భుతమైన పాత్రలతో మెప్పిస్తుంది. మంచి క్యారెక్టర్స్ చేస్తూ మంచి ఇమేజ్ సాధించింది. తర్వాత శ్రీముఖి ..కూడా క్యారెక్టర్స్ తో బాగానే ఆకట్టుకుంది. నేను శైలజ, జెంటిల్ మాన్ సినిమాలలో బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు కూడా ఒక సినిమా చేస్తుంది. 

 

ఇక హీరోలుగా సుధీర్ చాలానే కష్టపడుతున్నాడు. బుల్లితెరమీద మంచి క్రేజ్ ఉన్న సుధీర్ హీరోగా పరిచయమవుతూ సాఫ్ట్ వేర్ సుధీర్ సినిమా చేశాడు. మరికొన్ని సినిమాలు హీరోగా చేయాలని ఆశపడుతున్నాడు. మరి హీరోగా నిలదొక్కుకుంటాడా లేదా చూడాలి. ఇక యాంకర్ రవి కూడా ఇది మా ప్రేమకథ అన్న సినిమా చేసి సక్సస్ కాని సంగతి తెలిసిందే. వీరందరి కంటే విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ మాచిరాజు మొదటిసారి హీరోగా నటిస్తూ తన లక్ ని చెక్ చేసుకోబోతున్నాడు. ఇప్పటి వరకు జులాయి, అత్తారింటికి దారేది లాంటి సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేశాడు ప్రదీప్.

 

అయితే మొదటిసారి హీరోగా పరిచయమవుతూ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అన్న సినిమా చేశాడు. ఈ సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది. మరి ఈ సినిమాతో ప్రదీప్ హీరోగా సక్సస్ అవుతాడా లేదా చూడాలి. అయితే వీళ్ళందరు మాత్రం బుల్లితెరమీద సక్సస్ యాంకర్స్ గా లీడ్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: