తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని వంశానికి ప్రత్యేక స్థానం ఉంది. హీరోగా అక్కినేని నాగేశ్వరరావు నుంచి నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ వరకూ హీరోలుగా రాణిస్తూ నాగేశ్వరరావు వారసత్వాన్ని ఘనంగా చాటారు. తనయుడు నాగార్జున, మనవడు నాగ చైతన్యతో కలిసి నాగేశ్వరరావు కలిసి చేసిన సినిమా ‘మనం’. ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలోనే ఓ మధర జ్ఞాపకం అని చెప్పాలి. మూడు తరాల హీరోలు కలిసి సినిమా చేయడం మరెవరికీ ఇప్పట్లో సాధ్యం కానిది. ఈ సినిమా విడుదలై నేటితో 6ఏళ్లు పూర్తయ్యాయి.

IHG

 

అక్కినేని వంశం చేసిన ఈ సినిమా 2014 మే23న విడుదలైంది. సినిమా చూస్తే.. ఈ సబ్జెక్ట్ అక్కినేని కుటుంబం కోసమే పుట్టిందా అన్నట్టు ఉంటుంది. సినిమాలోని నాగేశ్వరరావు, నాగార్జున, చైతన్య పాత్రలు సరిగ్గా సరిపోయాయి. ఇంతటి టిపికల్ సబ్జెక్టును రాసుకున్న దర్శకుడు విక్రమ్ కుమార్ సినిమాను కూడా ఏమాత్రం కన్ఫ్యూజ్ కాకుండా తీశాడు. మంచి స్క్రీన్ ప్లేతో సినిమా ఆద్యంతం ఆసక్తికరంగా తెరకెక్కించాడు. ప్రేక్షకులు సినిమాలో లీనమయ్యేలా తీయడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. అక్కినేని మూడు తరాల హీరోలను తెరపై చూసిన ప్రేక్షకులు మైమరచిపోయారు. శ్రియ, సమంత హీరోయిన్లుగా నటించారు.

IHG

 

నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలతో కలిసి సినిమా చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించినా కాలేదు. కానీ విక్రమ్ కుమార్ దాన్ని సాధ్యం చేసాడు. అక్కినేని నాగేశ్వరరావుకు చివరి దశలో అద్భుతమైన కానుకగా ‘మనం’ సినిమాను అందించాడు. తెలుగు సినిమాల్లో అక్కినేని కుటుంబం చిరస్థాయిగా చెప్పుకునే సినిమాగా మలిచాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను నాగార్జునే స్వయంగా నిర్మించాడు. అఖిల్, అమల అతిధిపాత్రల్లో కనిపిస్తారు. అనూప్ రుబెన్స్ సంగీతం, పీఎస్ వినోద్ ఫోటోగ్రఫీ సినిమాకు అదనపు బలాలుగా నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: