ఇప్పటికే వరుసగా టాలీవుడ్ యువ హీరోలు ఒక్కరొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల నిఖిల్ సిద్దార్ధ, పల్లవి ల వివాహం ఘనంగా జరుగగా, మొన్న యువ నటుడు రానా దగ్గుబాటి వివాహ నిశ్చితార్ధం మిహికా బజాజ్ తో జరిగిన విషయం తెలిసిందే. కాగా వీరిద్దరి వివాహం రాబోయే డిసెంబర్ నెలలో జరుగనున్నట్లు రానా తండ్రి సురేష్ బాబు తెలిపారు. ఇక ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వివాహ కబురు కోసం ఆయన అభిమానులు, కుటుంబసభ్యుల తో పాటు యావత్ ప్రేక్షకులు మొత్తం కూడా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ముందుగా ప్రభాస్ పెళ్లి విషయమై రెండేళ్ల క్రితం వార్తలు విపరీతంగా హల్ చల్ చేసాయి. 
 
 
ఆయనతో కలిసి మిర్చి, బాహుబలి సినిమాల్లో జతకట్టిన అనుష్క శెట్టి తో ప్రభాస్ గాఢంగా ప్రేమలో ఉన్నారని, త్వరలో వారిద్దరి వివాహం కన్ఫర్మ్ కానుందని అప్పట్లో వార్తలు విపరీతంగా షికారు చేసాయి. అయితే ఆ విషయమై కొన్నాళ్ల క్రితం ప్రభాస్, అనుష్క ఇద్దరూ కూడా వివరణ ఇవ్వడం జరిగింది. వృత్తి పరంగా మేమిద్దరం కలిసి నటించినప్పటికీ మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని, మీరు అందరూ అనుకునే ప్రేమ లేదు సరికదా, మేమిద్దరం వివాహం కూడా చేసుకోబోవడం లేదని వారు స్పష్టం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ కూడా వీరిద్దరి వివాహం విషయమై ఇంకా అక్కడక్కడ పుకార్లు వస్తూనే ఉన్నాయి. అయితే ప్రభాస్ పెళ్లి కొద్దిరోజులు క్రితం ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్లు మరొక వార్త ప్రచారం కావడం జరిగింది. 
 
 
అమెరికా కు చెందిన ఒక పారిశ్రామికవేత్త కుమార్తెను ప్రభాస్ వివాహమాడనున్నట్లు ఆ వార్త యొక్క సారాంశం. అయితే అది కూడా ఒట్టి పుకారు మాత్రమే అని ఆ తరువాత తేలిపోయింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ వివాహ కబురు కోసం అందరూ కూడా ఎదురుచూస్తుండడంతో, ఈ ఆరడుగుల ఎత్తు, ఒడ్డు, అందం కలిగిన బాహుబలిని చేసుకునే ఆ అదృష్టవంతురాలు ఎవరా అని అందరూ ఎంతో ఆసక్తికనబరుస్తూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇంతకీ మన డార్లింగ్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందో, ఎవరితో జరుగుతుందో తెలియాలంటే మాత్రం ఇంకొన్నాళ్ళు ఓపికపట్టాల్సిందే.....!!

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: