ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొనియున్న పరిస్థితుల వల్ల గత రెండు నెలలుగా చిత్ర పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది. సినిమా షూటింగ్స్ బంద్ అయ్యాయి.. థియేటర్స్ మల్టీప్లెక్సెస్ క్లోజ్ అయ్యాయి.. సినిమా విడుదలలు ఆగిపోయాయి. దీంతో నిర్మాతలు గడ్డు కాలాన్ని ఎదుర్కుంటున్నారు. ఇప్పటికే ఫైనాసియర్స్ దగ్గర తెచ్చిన డబ్బులకు వడ్డీలు కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. మళ్ళీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయో.. థియేటర్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో అని ఆలోచించిన నిర్మాతలు తమ సినిమాలను డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ లకు సిద్ధ పడుతున్నారు. కొంతమంది మాత్రం పరిస్థితులు చక్కబడిన తర్వాత బిగ్ స్క్రీన్ మీద తమ చిత్రాలను రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. అంతేకాకుండా షూటింగులకు అనుమతిస్తే వెంటనే స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. వీటన్నిటికీ ఒక క్లారిటీ ఇస్తూ టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు వై వి ఎస్ చౌదరి ఈ మే 23 తన పుట్టినరోజు సందర్భంగా తనలా కళామాతల్లిని ప్రేమించే వారి మాటగా సినిమా కోసం తన వెర్షన్ ను వెలుబుచ్చారు.

 

IHG

 

మనిషి ఎలా ఉన్నా ఏం చేసినా సరే సినిమా కోసం మాట్లాడుకుంటూనే ఉంటాడని ఆలు సినిమా ఊసే అనేది లేకుంటే పొద్దు పోని వాళ్ళు కూడా లేరు అనడంలో ఎలాంటి అతిశేయోక్తి లేదని అన్నారు. దూరదర్శన్ నుంచి ఎల్ డి ప్లేయర్స్ వరకు, వీడియో పైరసి నుంచి ఇప్పటి ఛానెల్స్ వరకు, టీవీ సీరియల్స్, ఎన్నో ఎంటర్టైనింగ్ ప్రోగ్రామ్స్, అలాగే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ లు ఇలా ఎన్ని వచ్చినా థియేటర్ లో సినిమా నిలబడుతుంది అని తెలిపారు. అలా సముద్రంలాంటి సినిమాను ఈ కోవిడ్ 19 కాదు ఏది కూడా ఆపలేదని తెలిపారు. సినిమా అనుభూతిని వెండితెర మీద తప్ప మరే ఇతర మాధ్యమం ద్వారా పొందలేమని అలాగే సినిమాలో పొందే అనుభూతి మనకు తెలియకుండానే ఎన్నో ఎమోషన్స్ చూస్తాం. అందుకే సినిమాకు బ్రహ్మోత్సవాలు పట్టాభిషేకాలు చేస్తారని తాను బలంగా నమ్ముతా అని వెల్లడించారు. మే 23 నా జన్మదినం, ఈ సందర్భంగా నాకు జన్మనిచ్చివ నా తల్లిదండ్రులకు నాకు విద్యాబుద్ధులు చెప్పిన నా గురువులందరికీ, తన దివ్వమాహనరూపంతో సినిమా పట్ల సినిమా రంగం పట్ల నాకు ఆకర్షణ పెంపొందించిన అన్న 'ఎన్. టి. ఆర్' గారికి, నాకు దర్శకుడిగా జన్మనిచ్చిన ‘సెల్యూలాయిడ్ సైంటిస్ట్’ అక్కినేని నాగార్జున గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ.. ఈ కోవిడ్ 19 వలన అడవి కాచిన వెన్నెలలా మారిన తెలుగు పరిశ్రమ త్వరలోనే జన జీవన స్రవంతిలో కలసిపోయి పూర్వ ప్రకాశాన్ని పొందాలని కోరుకుంటున్నా అని వై వి ఎస్ చౌదరి ఒక లెటర్ ద్వారా తెలిపారు.

 

IHG

మరింత సమాచారం తెలుసుకోండి: