తెలుగు రాజకీయాల్లో చిరస్థాయిలో నిలిచిపోయిన పేరు కేసీఆర్... తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా అంతకు ముందు తెలుగు దేశం పార్టీలో మంత్రిగా తెలంగాణా సాధించిన నాయకుడిగా ఇప్పుడు తెలంగాణా సిఎం గా ఆయన సాధించిన ఘనతలు ఆయన రాజకీయాల్లో చూపించిన ప్రభావం తెలంగాణాను సాధించిన విధానం.. చివరికి చావు వరకు వెళ్లి వచ్చిన ఆయన విధానం అన్నీ కూడా ఇప్పటికి చాలా మంది కళ్ళల్లో ఉన్నాయి. ఇక ఆయన రాజకీయాలు అనగానే చాలా మందికి దూకుడు గుర్తుకు వస్తు ఉంటుంది. ప్రత్యర్ధి ఎవరు అయినా సరే ఆయన శైలి రాజకీయం వేరే ఉంటుంది. 

 

ఇక ఆయన స్వగ్రామం గురించి చాలా మందికి అవగాహన లేదు. ఆయనది మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామం. ఆయన ఏ స్థాయిలో ఉన్నా సరే గ్రామాన్ని మాత్రం మర్చిపోలేదు అని చెప్తూ ఉంటారు. ప్రతీసారి కూడా ఆయన పండగ వస్తే సొంత గ్రామానికి వెళ్తూ ఉంటారు. ఆ విధంగా ఆయన సొంత గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను సిఎం అయిన తర్వాత కూడా కొనసాగించారు. ఆ గ్రామంలో ఆయన ఎక్కువగా వ్యవసాయ౦ చేయడమే కాదు ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఉన్నత విద్యను అభ్యసించడం వంటివి చేసారు. 

 

ఇక ఇప్పుడు సిఎం గా ఉన్నా సరే తన గ్రామానికి తాను ఏది చేయగలనో అది చేస్తాను అంటూ అక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆ గ్రామం దేశంలోనే ఆదర్శ గ్రామమగా ఉంది అని చెప్తూ ఉంటారు. సిఎం అయిన తర్వాత ఆయన సొంత గ్రామం మీద ఎంతో ప్రేమ చూపించడమే కాదు దత్తత కూడా తీసుకున్నారు. సాగు తాగు నీరు ఎన్నో కూడా గ్రామానికి అందాయి. అక్కడి రైతులకు కూడా ఆయన వ్యక్తిగతంగా సాయం చేస్తూ ఉంటారని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: