తెలుగు సినిమాలోనే కాదు ఇండియన్ సినిమాలో కూడా తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న దర్శకుడు రాఘవేంద్ర రావు. ఆయన సినిమాలు అనగానే చాలా మందికి ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఈ తరం ప్రేక్షకులకు ఆయన సినిమాలు అంతగా ఎక్కలేదు గాని కిందటి తరం ప్రేక్షకులు అయితే ఆయన సినిమాలను ఎక్కువగా ఆదరించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన జీవితంలో దాదాపు అందరు అగ్ర హీరోలతో కలిసి పని చేసారు. ఆయన జీవితంలో ఏ నిమిషం చూసినా సరే సినిమానే కనపడుతుంది. ఆ విధంగా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. 

 

చిరంజీవి ఎన్టీఆర్ బాలకృష్ణ నాగార్జున శోభన్ బాబు అక్కినేని ఇలా ఎవరి తో చూసినా సరే ఆయన సినిమాలు నిలిచాయి. వారి తో కలిసి ఆయన మంచి మంచి సినిమాలను చేసారు తక్కువ కాలంలో ఆయనకు స్టార్ దర్శకుడిగా మంచి పేరు అనేది వచ్చింది. ఇక ఆయన సినిమాలు చాలా వరకు హిట్ కావడం తో ఆయనను ఎక్కువగా ఇండియన్ సినిమాలో అగ్ర దర్శకుల్లో ఒకరిగా పోల్చారు. ఎన్నో రికార్డులు ఆయన సినిమాలు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అది పక్కన పెడితే ఆయన చిన్న నాటి జీవిత౦ ఆయన వ్యక్తిగత జీవితం గురించి చాలా మందికి అవగాహన లేదు. 

 

ఇక ఆయన పుట్టింది కృష్ణా జిల్లాలోని కోలవెన్ను. ఆయన అక్కడ పుట్టి అక్కడే పెరిగారు. ఆయన ఆ తర్వాత ఎన్టీఆర్ ఎన్టీఆర్ తో అనుబంధం ఉండటం అక్కడి నుంచి సినిమాల్లోకి అడుగు పెట్టి అగ్ర దర్శకుడిగా మారడం జరిగిపోయాయి. ఆయన జీవితం ఎక్కువగా చెన్నై లో హైదరాబాద్ లో గడిచింది. ఆయన సినిమాలు ఇప్పటికి కూడా ఒక రేంజ్ గుర్తింపు ని సంపాదించుకున్నాయి. స్టార్ హీరోలు అందరికి ఆయన మంచి హిట్స్ ఇచ్చారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి: