సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులందరూ ఒకప్పటి రచ్చయితలే. సినిమా కథ దగ్గర నుండి మాటల వరకూ దర్శకుడే రాసుకుంటున్నారు. రచయితలుగా ఉన్నవారు దర్శకులుగా మారుతున్నారు. రచయితగా పేరు, డబ్బు అనుకున్నంతగా రాకపోవడం కూడా వారిని దర్శకులుగా మారుస్తుంది. రచయితగా దర్శకులుగా మారిన వారిలో వక్కంతం వంశీ కూడా ఒకరు. కిక్, టెంపర్, రేసుగుర్రం వంటి సక్సెస్ ఫుల్ సినిమాలకి రచయితగా పనిచేసిన వక్కంతం వంశీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో రచయితగా మారాడు.

 

నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ఫెయిల్యూర్ తర్వాత వక్కంతం వంశీ మళ్లీ సినిమా చేయలేదు. రచయితగా సూపర్ సక్సెస్ లో ఉన్న వక్కంతం వంశీకి దర్శకుడిగా మారాకా నా పేరు సూర్య రూపంలో భారీ డిజాస్టర్ ఎదురయింది. అల్లు అర్జున్ పర్ ఫార్మెన్స్ సూపర్ గా ఉన్నప్పటికీ కథ ఎటెటో వెళ్ళిపోవడం వల్ల సినిమా ఫ్లాపై కూర్చుంది. మొదటి సినిమానే ఫ్లాప్ కావడంతో వంశీకి మళ్ళీ సినిమా దొరకలేదు.

 

అయితే తాజాగా వంశీ ఒక కథ రాసుకున్నాడట. ఆ కథని నానితో చేద్దామని స్కిప్టు వినిపించాడట కూడా. కథ నచ్చిన నాని తనకంటే రవితేజకే ఈ కథ బాగా సూట్ అవుతుందని చెప్పాడట. కొంచెం మాస్ టచ్ ఉన్న ఈ స్క్రిప్టు రవితేజ చేస్తే బాగుంటుందని అన్నాడట. గత కొన్ని రోజులుగా నాని మాస్ సినిమాలు చేయట్లేదు. గతంలో మాస్ టచ్ ఉన్న చిత్రాలు చేసి చేతులు కాల్చుకోవడంతో అలాంటివి చేయకూడదని డిసైడ్ అయ్యాడట.

 

అందుకే మాస్ సినిమాలు సూటయ్యే రవితేజకి బాగుంటుందని చెప్పాడట. నాని చెప్పిన సలహాని సీరియస్ గా తీసుకున్న నాని రవితేజని కలిసి కథ వినిపించాడని అంటున్నారు. రవితేజకి కూడా కథ బాగా నచ్చిందట. అన్నీ కుదిరితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా మొదలయ్యే ఛాన్స్ ఉంది. లాక్డౌన్ పూర్తయిన తర్వాత ఈ విషయంలో స్పష్టత వస్తుందని అంటున్నారు. వంశీకి ఈ సారైనా సరైన హిట్ పడుతుందా లేదా చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: