కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో సినిమా థియేటర్లన్నీ మూతబడిపోయాయి. కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే పరిస్థితి కనిపించడం లేదు. అందువల్ల జనాలందరూ వినోదం కోసం ఓటీటీ వంక చూస్తున్నారు. లాక్డౌన్ పెట్టడం ఓటీటీలకి ఓ వరంగా మారిందని చెప్పవచ్చు. డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లకి గిరాకీ బాగా పెరిగింది.

 

సబ్ స్క్రయిబర్స్ విపరీతంగా పెరిగారు. ఈ నేపథ్యంలో ఈ ఫ్లాట్ ఫామ్స్ మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఆ పోటీలో నెగ్గడానికి అల్లు అరవింద్ స్టార్ట్ చేసిన ఆహా యాప్ చాలా పెద్ద ప్లానే వేసింది. ఇటీవల స్టార్ట్ అయిన ఈ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కి సబ్ స్క్రయుబర్లు బాగానే పెరుగుతున్నారు. కాకపోతే దీనిలో ఉన్న వెబ్ సిరీసెస్ కానీ, సినిమాలకి గానీ ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోతున్నారు. చిన్న హీరోల సినిమాలు, అంత గొప్పగా లేని కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు ఆహా పట్ల విముఖత కలిగించేలా ఉన్నాయి.

 

ప్రస్తుతం అల్లు అరవింద్ ఆహా కోసం వెబ్ సిరీస్ లని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఈ బాధ్యతని అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకుందని సమాచారం.  మార్కెట్ లో ఉన్న స్ట్రీమింగ్ ఛానెల్స్ కి పోటీగా స్ట్రాంగ్ కంటెంట్ తో వెబ్ సిరీస్ లని రూపొందించాలని ప్లాన్ వేశారు. అదే కాదు ఆహా టీమ్ మరో సరికొత్త ప్లాన్ తో ముందుకు వచ్చింది. పిల్లలకి ఇష్టమైన కార్టూన్ సిరీస్ లని కూడా అందిస్తోంది.ఆహా పిల్లలరాజ్యం పేరుతో చిన్న పిల్లలకి సంబంధించిన కార్టూన్లని అందిస్తోంది.

 


చోటా భీమ్ మొదలుకుని మైటీ రాజు వరకూ సుమారు ౩౦ రకాల కార్టూన్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మరి వీటి ద్వారానైనా ఆహాకి ఆదరణ పెరుగుతుందేమో చూడాలి. అంతే కాదు విజయ్ దేవరకొండ నిర్మాణంలో ఆహా కోసం వెబ్ సిరీస్ రూపొందనుందట. అన్నీ కలిసొచ్చి ఆహాని పోటీలో నిలబెడతాయా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: