రానా... టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలో తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో. తండ్రి తాత స్టార్ నిర్మాతలు అయినా తాను మాత్రం తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర రానా వేసుకున్నాడు అనేది వాస్తవం. రానా సినిమాలు అనగానే అన్ని భాషల్లో కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది అనే విషయం అందరికి తెలిసిందే. రానా సినిమాకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు పక్కన పెడితే వ్యక్తిగత జీవితం గురించి కూడా జనాలకు ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అనే సంగతి తెలిసిందే. రానా సినిమాల కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసినట్టే... 

 

ఆయన వ్యక్తిగత జీవితంలో ఏది జరుగుతుంది ఏంటీ ఆయన లవర్ ఎవరు ఏంటీ అనే విషయాలను ఎక్కువగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు జనాలు. ఇప్పటికి కూడా రాణాకు ఏదే విధంగా క్రేజ్ ఉంది. ఇక రానా చిన్న తనం విషయానికి వస్తే ఆయన సొంత ఊరు చాలా మందికి తెలియదు. ఆయన సొంత ఊరు ప్రకాశం జిల్లాలోని కారం చేడు. ఆయన అక్కడే పుట్టాడు. తండ్రి తాత కూడా అక్కడే పుట్టారు. ఇక ఆ తర్వాత హైదరాబాద్ లో చెన్నై లో ఎక్కువగా ఉన్నాడు రానా. ఆ విధంగా రానా చిన్నతనం ఎక్కువగా చెన్నై లో గడిచింది అనే చెప్పుకోవచ్చు. 

 

రానా పెళ్లి కుదిరింది. మిహికా బజాజ్ అనే అమ్మాయిని రానా వివాహం చేసుకుంటున్నాడు. వీరి వివాహం వచ్చే ఏడాది జరిగే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రస్తుతం రానా కాబోయే భార్య దగ్గర ఉన్నాడని అంటున్నారు. ఇక అతను మూడు సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూడు సినిమాలు కూడా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయాయి. ఈ మూడు సినిమాలను వచ్చే ఏడాది విడుదల చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: