కోలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరో అజిత్ అంటే అభిమానులకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.  రజినీకాంత్ తర్వాత ఆ తరహా మాస్ ఇమేజ్ సంపాదించారు ఈ అచ్చమైన తెలుగు హీరో ప్రేమ పుస్తకం మూవీతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన అజిత్ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లి అక్కడ స్టార్ హీరోగా ఎదిగారు.  మాస్ ఇమేజ్ బాగా సంపాదించిన అజిత్ తెలుగు లో డబ్ అవుతున్నా ఆ మూవీలు కూడా మంచి క్రేజ్ లభిస్తుంది.  అజిత్ చాలా సాదా సీదా వ్యక్తిత్వం ఉన్న మనిషి.. అందుకే ఆయన ఎంతో సహజంగా తెల్ల జుట్టుతోనే నటిస్తుంటారు. ఒక సెలబ్రెటీ హోదా లో కాకుండా సామాన్య పౌరుడిలా జనజీవనంలో కలిసిపోతుంటారు. 

 

కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన భార్య షాలినితో కలిసి ఆసుపత్రికి వెళ్లి వస్తున్న వీడియో వైరల్ కావడం ఆయన అభిమానుల్లో చర్చకు దారితీసింది. మాస్కులు ధరించి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి నుంచి వారు ఇంటికి వెళ్తున్నట్టుగా ఆ వీడియోలో ఉంది.  ప్రస్తుతం షూటింగ్స్ ఆగిపోయాయి.. అందరూ ఇంటిపట్టున ఉంటున్నారు.  ఈ సమయంలో అజిత్ ఆసుత్రిలో కనిపించడంతో అభిమానులు కలవరపడుతున్నారు. అజిత్ అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఆయన ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  అయితే ఇది భయపడాల్సిన విషయం కాదని క్యాజువల్ చెకప్ అని అంటున్నారు.

 

అంతే కాదు  వారు రెగ్యులర్ చెకప్‌లో భాగంగానే ఆసుపత్రికి వెళ్లారని, ఇందులో ఆందోళన చెందాల్సిందేమీ లేదని చెబుతున్నారు. మరోవైపు, గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తండ్రిని చూసేందుకే అజిత్ ఆసుపత్రికి వెళ్లినట్టు మరికొందరు చెబుతున్నారు. అయితే, అజిత్ మేనేజర్ నుంచి అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు.  కాకపోతే ఇప్పుడు తమ అభిమాన నటులు ఎవరు ఆసుపత్రివద్ద ఉన్నా అభిమానులు కంగారు పడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: