నందమూరి బాలకృష్ణ... తెలుగు సినిమాలో తన కంటూ ఒక ముద్ర వేసుకున్న స్టార్ హీరో. ఎవరికి కూడా దక్కని గుర్తింపు పేరు తక్కువ కాలంలో ఆయనకు దక్కాయి అనేది వాస్తవం. ఏ స్టార్ హీరో కూడా ఆ స్థాయిలో అతి తక్కువ కాలంలో అంత పేరు తెచ్చుకున్న సందర్భం అనేది లేదు అనే చెప్పవచ్చు. ఇక ఆయన సినిమాలు అనగానే చాలా మందికి ఇప్పటికి కూడా ఒక క్రేజ్ అనేది ఉంటుంది. ఫ్యాక్షన్ సినిమాలు అంటే బాలకృష్ణ అనే విధంగా ఆయన తన గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఆయన సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే పెద్దగా ఆయన పట్టించుకునే ప్రయత్నం చేయరు. 

 

ఇక సినిమాలు చేస్తూ వెళ్తుంటే ఎందరికో ఉపాధి వస్తుంది అనే భావన లోనే బాలకృష్ణ ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఇక ఆయన సినిమాలు ఇప్పటి యువతకు బాగా దగ్గర అయ్యాయి అనేది వాస్తవం. అది  పక్కన పెడితే ఆయన పుట్టిన ఊరు కృష్ణా జిల్లాలోని నిమ్మకూరు. ఆ ఊరిలోనే ఆయన చిన్నతనం అంతా ఉన్నా ఆ తర్వాత తండ్రి స్టార్ హీరో అవ్వడం తో చెన్నై వెళ్ళారు. అక్కడ ఎక్కువగా చదువుకున్న బాలకృష్ణ ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశారు. బాలకృష్ణ కు కృష్ణా జిల్లాతో చిన్న  తనం నుంచి కూడా మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. 

 

ఇక ఆయన ఇప్పటికి కూడా సొంత ఊరు వారి బంధువులను కలవడానికి ఎన్నో సందర్భాల్లో వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తండ్రి బయోపిక్ సమయంలో ఆయన ఎక్కువగా గ్రామంలో గడిపారు కూడా. ఆ విధంగా తన పుట్టిన ఊరుని ఆయన అసలు మర్చిపోలేదు. ఇక బాలకృష్ణ ఇప్పుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: