తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగిన నటుడు శోభన్ బాబు. ఎక్కడో మారు మూల పల్లె నుంచి వచ్చి అమ్మాయిలకు సోగ్గాడిగా స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగారు ఆయన. ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో విజయాలు మరెన్నో ఘనతలు. అతి తక్కువ కాలంలో ఏ స్టార్ హీరో కూడా సాధించలేరు అనుకున్న ఎన్నో మరెన్నో విజయాలను ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. శోభన్ బాబు అనగానే ఒక క్రేజ్ అనేది ఉండేది. ఆయన సినిమాలు అనగానే ప్రేక్షకులు పనులు మానుకుని చూసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఆయన సినిమాలు ఆ విధంగా ప్రభావితం చేసాయి అనే చెప్పవచ్చు. 

 

ఇక అది అలా ఉంటే ఆయన పుట్టిన ఊరు ఏంటీ అనేది చాలా మందికి తెలియదు. కృష్ణా జిల్లా అని మాత్రమే చాలా మందికి అవగాహన అనేది ఉంది. అయితే ఆయన పుట్టిన ఊరు మైలవరం నియోజకవర్గంలోని జీ కొండూరు మండలంలో ఉన్నతు వంటి చిన నందిగామ. ఆయన అక్కడ పుట్టడమే కాదు చిన్న తనం ఎక్కువగా అక్కడే గడిపారు. ఇక ఆయన జీవితంలో ఎక్కువ భాగం విజయవాడ లోను చెన్నై లునో గడిచిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ తో ఆయనకు అనుబంధం చాలా తక్కువగా ఉండేది అని చెప్తూ ఉంటారు. 

 

ఇక ఆయన సినిమాలు అనగానే ఇప్పటికి కూడా చాలా మందిలో ఒక క్రేజ్ అనేది ఉంది. ఆయన సినిమా టీవీ లో వస్తుంది అంటే చాలా మంది పనులు మానుకుని కూడా చూసే సందర్భాలు ఇప్పటికి కూడా ఉంటాయి. ముఖ్యంగా ఆయనకు మహిళా అభిమానులు ఎక్కువ. వారు ఆయన సినిమాలను ఎక్కువగా ఆదరించిన సంగతి తెలిసిందే. అతి తక్కువ కాలంలో వారి లో ఆయన సోగ్గాడిగా మంచి గుర్తింపు సంపాదించుకుని తన దైన ముద్ర వేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: