తెలుగు సినిమాల్లో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవికి సినిమా నేపథ్యం లేదు. చిన్నప్పటి నుంచి చదువులో కానీ చేసే పనిలో కానీ శ్రద్ధ పెట్టి చేయడమే చిరంజీవికి ఉన్న లక్షణం. అదే చిరంజీవిని చదువు పూర్తవగానే సినిమాల వైపు మళ్లించింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం సమీపంలోని మొగల్తూరు గ్రామంలో మేనమామ ఇంట పుట్టిన చిరంజీవికి పల్లెటూరి నేపథ్యం నుంచే వచ్చాడు. గ్రామీణ నేపథ్యంలోనే ఎక్కువగా ఉన్నా తండ్రి ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో నివాసం ఉన్నారు. కానీ చిరంజీవి నేపథ్యం అంటే గ్రామీణం అనే చెప్పాలి.

 

 

కెరీర్ తొలినాళ్లలో కూడా చిరంజీవి చేసిన అనేక చిన్న చిన్న పాత్రలు గ్రామీణ నేపథ్యంలోనే ఉండేవి. మన ఊరి పాండవులు సినిమా సమయంలో ఓ సీన్ లో బయట నుంచి ఇంటికి వచ్చే సీన్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో తన మీద గడ్డి కాళ్లకు దుమ్ము కావాలనే చేసుకుని సీన్ కు సిద్ధమయ్యాడట. దీన్ని గమనించిన దర్శకుడు, కెమెరామెన్ ఎందుకని అడిగితే.. పల్లెటూరి వాతావరణం కనపడాలంటే ఇలా ఉండాలని చేశాను అని సమాధానం చెప్పాడట. ఇదంతా చిరంజీవికి పల్లెటూళ్లో పుట్టి పెరగడం వల్లే తెలిసింది అని చెప్పాలి. చిరంజీవి సృజనను అప్పుడు సెట్లో అందరూ ఆశ్చర్యంగా చెప్పుకున్నారు.

 

 

ఎనభయ్యో దశకంలో పల్లెటూరి నేపథ్యంలో సినిమాలు ఎక్కువగా వచ్చేవి. అదే చిరంజీవికి ఎంతో దోహదపడ్డాయి. పల్లెటూళ్ల గురించి ఆయన ఎన్నో సినిమాల్లో కూడా వాటి ఔన్నత్యం చూపించారు. ఖైదీ నెంబర్ 150లో కూడా పల్లెటూళ్ల గొప్పదనం గురించి చిత్ర కథాంశం ఉంటుంది. చిరంజీవి పుట్టిన మొగల్తూరులోని ఆయన నివాసాన్ని తర్వాత రోజుల్లొ విక్రయించినా అభిమానులకు మాత్రం ఆ ఇల్లు అపురూపమే. ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నారు. త్వరలో సినిమా షూటింగ్ మళ్లీ ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: