వారసత్వంలో సినీ పరిశ్రమలోకి వచ్చే హీరోలకు బ్యాక్ గ్రౌండ్ కొంతవరకే ఉపయోగపడుతుంది. కానీ ఆ బ్యాక్ గ్రౌండ్ ను కాకుండా తనదైన యాక్టింగ్ తో ప్రేక్షకులను మెప్పించాలి అని భావించే నటుల్లో అక్కినేని నాగార్జున కూడా ఉంటారు. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన నాగార్జున తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. తొలి సినిమాను విక్టరీ మధుసూదన్ రావు దర్శకత్వంలో యాక్షన్ నేపథ్యంలో తొలి సినిమా ప్రారంభించారు. 34 ఏళ్ల క్రితం విడుదలైన ఆ సినిమానే విక్రమ్’.సినిమా ఘన విజయంతో నాగార్జున కెరీర్ కు తిరుగులేకుండా పోయింది.

IHG

 

అప్పటికే సీనియర్ స్టార్ డైరక్టర్ మధుసూదన్ రావు. ఆయన దర్శకత్వంలో నాగార్జునను లాంచ్ చేశారు. 1986 మే 23న విడుదలైన ఆ సినిమాలో నాగార్జున మంచి ఫోర్స్ ఉన్న పాత్రలో నటించారు. హిందీలో జాకీష్రాఫ్ నటించిన హీరో అప్పట్లో బ్లాక్ బస్టర్. ఆ సినిమా రీమేక్ రైట్స్ తీసుకుని నాగార్జునను లాంచ్ చేశారు. యువత ఆలోచనలను ప్రతిబింబించే పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే యాక్షన్ ఓరియంటెడ్, ప్రేమ కథాంశంలో నటించారు నాగార్జున. నటనలో పరిణఇతి చూపించి ఆకట్టుకున్నాడు నాగ్. నాగార్జునకు జోడీగా శోభన నటించింది.

IHG

 

ఈ సినిమాలో మధు ఫిలిం ఇనిస్టిట్యూట్ విద్యార్ధులు కూడా నటించడం విశేషం. టైటిల్ కార్డ్స్ లో విద్యార్ధుల పేర్లను కూడా వేయడం విశేషం. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగేశ్వర రావు స్వీయ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. చక్రవర్తి సంగీతంలోని పాటలు అకట్టుకుంటాయి. తొలి సినిమానే నాగార్జున తన నటనతో శతదినోత్సవ సినిమాగా మలుచుకున్నాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో నాగ్ కెరీర్ కు తిరుగులేకుండా పోయింది. ఆ జనరేషన్ లోని నాగార్జున సూపర్ స్టార్ గా ఎదిగిపోయాడు.

Image

మరింత సమాచారం తెలుసుకోండి: