జేమ్స్ కామెరూన్... ఈయన తెలియని సినిమా ప్రేక్షకుడు అంటూ ఉండడు. దీనికి కారణం ఆయన నిర్మించిన అనేక హాలీవుడ్ విజువల్ వండర్స్ అని చెప్పవచ్చు. జేమ్స్ కామెరూన్  రూపుదిద్దిన వెండితెర విజువల్ వండర్ అవతార్ కు సీక్వెల్ గా అవతార్ - 2 మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యింది. వాస్తవానికి అవతార్ 2 సినిమాని 2021 డిసెంబర్ నెలలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించడం జరిగింది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

Our #Avatar sets are ready — and we couldn’t be more excited to be headed back to new zealand next week. Check out the Matador, a high speed forward command vessel (bottom) and the Picador jetboat (top) — can’t wait to share more.

A post shared by Jon Landau (@jonplandau) on


కానీ దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో పరిస్థితులు అనుకోని విధంగా మారిపోవడం జరిగింది. ఇక వైరస్ ను అరికట్టేందుకు విధించిన లాక్ డౌన్ తో అన్నీ కూడా నిలిచిపోయాయి. అంతేకాకుండా రెడీగా ఉన్న సినిమాలు కూడా రిలీజ్ చేయకుండా అలాగే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల సినీ పరిశ్రమల షూటింగ్ లను మళ్లీ ప్రారంభించడానికి సన్ సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగానే అవతార్ 2 సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభించడానికి దర్శకనిర్మాతలు అనేక చర్యలు చేపడుతున్నారు. 


ఈ సందర్భంగా మూవీ ప్రొడ్యూసర్ జాన్ లాండు సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. ఇక మా అవతార్ 2 సినిమా కోసం స్పెషల్ గా వేసిన సెట్స్ లు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి... వచ్చే వారంలో న్యూజిలాండ్ లో షూటింగ్ ప్రారంభించడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. షూటింగ్ లో భాగంగా సముద్ర గర్భం నేపథ్యంలో సాగే సీన్ షూట్ చేయబోతున్నారు. ఇక ఈ షూటింగ్ కు సంబంధించిన బోటు, చెట్లకు సంబంధించిన ఫోటోలను జాన్ అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇకపోతే మనందరికీ తెలిసిన విషయమే అవతార్ మొదటి భాగం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ అంటే ప్రేక్షకుల్లో మరింత అంచనాలు మొదలయ్యాయి. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసుకోవాలి అంటే మరి కొంత కాలం వేచి ఉండక తప్పదు.

మరింత సమాచారం తెలుసుకోండి: