షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు సినీ ప్రముఖులు అందరూ కూడా సినిమాల షూటింగ్ లకు సిద్దమవుతున్నారు. దాదాపు అన్ని సినిమాల షూటింగ్ ని మొదలుపెట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఈ తరుణంలో సినీ పెద్దలు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఆదేశాలను పాటిస్తూనే కొన్ని సినిమాల షూటింగ్ ని మాత్రమే మొదలుపెట్టాలి అని భావిస్తున్నారు. 

 

ముందు మొదలైన సినిమాలను పూర్తి చెయ్యాలని కొత్త సినిమాల షూటింగ్ అనేది అప్పుడే వద్దని కొన్ని రోజులు ఆగిన తర్వాత వాటిని మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారని, పది శాతం పూర్తి అయిన సినిమా షూటింగ్ లను ముందుకి తీసుకుని వెళ్ళాలి అని భావిస్తున్నారు. ఈ లెక్కన ప్రభాస్, ఎన్టీఆర్ రామ్ చరణ్ చిరంజీవి సహా కొందరు స్టార్ హీరోల సినిమాలు మొదలయ్యే అవకాశం ఉంది. ఈ ముగ్గురు హీరోలు న‌టిస్తోన్న సినిమాల షూటింగ్ ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు కంప్లీట్ అయిన సంగ‌తి తెలిసిందే.

 

ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ చాలా వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. ప్ర‌భాస్  - రాధాకృష్ణ సినిమా సంగ‌తి కూడా అంతే. ఇక మహేష్ బాబు పరుశురాం దర్శకత్వంలో చేస్తున్న సినిమా వాయిదా పడే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. ఆ సినిమాకు అంగీకరించే అవకాశం లేదని సమాచారం. ఆ సినిమా షూటింగ్ మొదలు కాలేదు కాబట్టి ఆలస్యంగా మొదలుపెట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారీగా ఖర్చు పెట్టిన సినిమాలను ముందు పూర్తి చేస్తామని తెలంగాణా సిఎం కేసీఆర్ కి సినీ ప్రముఖులు చెప్పినట్టు సమాచారం.

 

సో ఈ లెక్క‌న చూస్తే టాప్ హీరోల్లో మ‌హేష్ బాబు సినిమా ఇంకా షూటింగ్ కూడా ప్రారంభం కానందున ఇప్ప‌ట్లో మ‌హేష్ సినిమా వ‌చ్చే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌న‌ప‌డుతున్నాయి. ఒక్క మ‌హేష్‌కు మాత్ర‌మే కాదు ప‌లువురు హీరోల సంగ‌తి ఇంతే..?

మరింత సమాచారం తెలుసుకోండి: