టాలీవుడ్ లో రెండు మూడు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మంద‌న్న‌.  ర‌ష్మిక‌ చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా సరే ఆమెకు మాత్రం మంచి గుర్తింపు అనేది వచ్చింది. ర‌ష్మిక సినిమాలో ఉందంటే చాలు ఆమె కోసం సినిమాలు చూసే యువ‌త చాలా మందే ఉన్నారు. టాలీవుడ్ ను వ‌చ్చే రెండు మూడేళ్లు ఆమె ఏలేస్తుంద‌ని అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆమె కు తెలుగు లో వ‌స్తోన్న అవ‌కాశాల నేప‌థ్యంలో సొంత ఇండ‌స్ట్రీ అయిన క‌న్న‌డ ను కూడా వ‌దులు కునేందుకు సిద్ధంగా ఉంది.

 

ఇక తెలుగులో అగ్ర హీరోల సినిమాల్లో ఆమెనే ఫ‌స్ట్ ఛాయిస్‌గా ఎంపిక కూడా చేసుకుంటున్నారు. మహేష్ బాబు తో ఆమె మంచి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ తరుణంలో ఆమె గురించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అనేది ఒకసారి చూస్తే... ఆమెకు టాలీవుడ్ లో కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాలి అనే కోరిక ఉందని సమాచారం. 

 

ఈ మేరకు ఆమె కొంత మంది యువ దర్శకులు కథలు తనకు మెయిల్ చెయ్యాలి అని కోరినట్టు తెలుస్తుంది. తనకు కథలను మెయిల్ చేసినా లేదా వీడియో కాల్ ద్వారా తనకు వివరించినా సరే సినిమా చేస్తాను అని చెప్పినట్టు సమాచారం. మంచి కథ అయితే తనకు సినిమా చేయడానికి ఏ ఇబ్బంది లేదని అందుకు తక్కువ పెట్టుబడి అయితే చాలు అని ఆమె వివరించినట్టు వార్తలు వస్తున్నాయి. 

 

అందుకే కొందరు యువ రచయితలు ఆమెకు మంచి కథలను పంపించార‌ని... క యువ హీరో తో ఆమె సినిమా చేయడానికి రెడీ అయింది అని ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో ఆమె హీరోయిన్‌గా మాత్రం నటించే అవకాశం లేదని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: