చిత్ర సీమ అని అందుకే అంటారేమో. ఇది నిజంగా విచిత్రమైన సీమ. ఇక్కడ అన్నీ లక్కుని తొక్కే నడుస్తాయి. టాలెంట్ కూడా సెకండరీవే. అందుకే హిట్లు ఫట్లూ కూడా ఆ కోణంలో నుంచే చూడాలి. టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు ది గోల్డెన్ హ్యాండ్ అంటారు. ఆయన అందరికీ హిట్లు సూపర్ హిట్లూ ఇచ్చారు.

 

కానీ రొమాంటిక్ కింగ్ అక్కినేనికి మాత్రం జస్ట్ ఏవరేజి సినిమాలే ఇచ్చారు. సూపర్ హిట్లు ఈ ఇద్దరి కాంబోలో లేవు. రాఘవేంద్రరావు అక్కినేని నాగేశ్వరరావు  కాంబోలో ప్రేమ కానుక వంటి సినిమాలు వచ్చాయి కానీ అవన్నీ ఏవరేజి గానే మిగిలాయి. ఇదిలా ఉంటే అక్కినేని ఎన్టీయార్  కాంబోలో రాఘవేంద్రరావు తీసిన సత్యం శివం వంటి సినిమాలు కూడా హిట్ టాక్ తెచ్చుకోలేదు.

 

అదేంటో అందరి హీరోలకు హిట్లు ఇచ్చి ఏయన్నార్ దాకా వచ్చేసరికి మాత్రం గోల్డెన్ హ్యాండ్ ఎందుకో పనిచేయలేదులా ఉంది. అయితే అదే రాఘవేంద్రరావు హ్యాండ్ కొడుకు నాగార్జునకు బాగా కలసివచ్చింది. ఆఖరి పోరాటం. అన్నమయ్య, ఘరానా బుల్లోడు, శ్రీరామదాస్ వంటి సినిమాలు సూపర్ హిట్లు అయ్యాయి. ఈ ఇద్దరూ కలసి ట్రెండ్ భక్తి సినిమాల్లో కొత్త ట్రెండ్ క్రియేట్ చేశారు.

 

ఇదిలా ఉండగా రాఘవేంద్రరావు ఎన్టీయార్ హీరోగా వచ్చిన  మూవీ పాండవ వనవాసానికి తొలిసారి అసిస్టెంట్ గా పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దగ్గర చేరారు. ఆ తరువాత వి మధుసూధనరావు వంటి దిగ్దర్శకులతో సహాయ దర్శకుడిగా  పనిచేసి అనుభవం గడించారు. 1975లో శోభన్ బాబుతో బాబు మూవీని తీసి తొలిసారి సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిపించుకున్నారు.

 

ఆ తరువాత వంద సినిమాలకు డైరెక్షన్ చేసి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు ఇచ్చారు. ఏది ఏమైనా దర్శకుడిగా రాఘవేంద్రుని కిక్కూ, మ్యాజిక్కే వేరు. మే 23 అంటే గుర్తుకువచ్చేది ఆయన పుట్టిన రోజు అనే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: