టాలీవుడ్ లోకి మెగా ఫ్యామిలి నుండి వచ్చి  తనదైన నటన, డ్యాన్స్ తో అధిక సంఖ్యలో ఫ్యాన్స్ ని సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్. తన తండ్రి అల్లు అరవింద్ ఇండస్ట్రీలో పెద్ద నిర్మాతగా ఉన్నా అల్లు అర్జున్ మాత్రం స్వశక్తితో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. అయితే ఎంతటి కష్టమైనా డ్యాన్స్ స్టెప్స్ అయినా సునాయాసంగా చేయడం అల్లు అర్జున్ స్పెషాలిటీ.  దానికి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా తీసుకుంటాడని ఇండస్ట్రీ టాక్. దీని ప్రకారం అతనికి భారీగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తుంది.

 

టాలీవుడ్ లో అల్లు అర్జున్ గురించి, అతనికి ఉన్న క్రేజ్ గురించి తెలియని వారుండరు. సినిమా సినిమాకు ఒక కొత్త లుక్ తో అభిమానులను ఆకర్షిస్తూ ఉంటారు. వరుస హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ లో స్టయిలిష్ స్టార్ గా ఎదిగాడు అల్లు అర్జున్. అయితే ప్రస్తుతం అల్లు అర్జున్ నటుడిగానే కాక వ్యాపార వేత్తగా మారినట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ పలు ఐటి సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. అంతేకాక అనేక వ్యాపార సంస్థల్లో కూడా ఆయన పెట్టుబడులు ఉన్నట్టు టాలీవుడ్ టాక్. 

 

 అల్లు అర్జున్ ధరించే బట్టలు విషయానికి వస్తే వాటిని డిజైన్ చేయటానికి అర్జున్ కోసమే ప్రత్యేకంగా ఒక కాస్ట్యుమ్  డిజైనర్ ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ వాడే కార్ల విషయానికి వస్తే ఆయన షెడ్ లో బియండబ్ల్యు, రేంజ్ రోవర్, ఆడి, జాగ్వర్, టయోటా క్రుజర్ వంటి హై ఎండ్ కార్లు ఉన్నాయి.  ఈ విషయం అలా ఉంచితే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కేరళలో అటవీ ప్రాంతంలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ కారణం గా షూటింగ్ కి విరామం వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: