ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎన్టిఆర్, ఏయన్నార్ లు మూల స్తంభాలుగా ఉండేవారు. అయితే వారి తర్వాత దాసరి నారాయణ రావు గారు ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఇండస్ట్రీ లో ఏ విధమైన గొడవలు వచ్చినా, సినిమా రిలీజ్ లు అయినా దాసరి గారు మంచి సలహాలు ఇచ్చేవారు. అయితే పలు సేవా కార్యక్రమాలతో అభిమానుల ప్రశంసలు అందుకున్న చిరంజీవి గారే, దాసరి గారు కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో పెద్ద దిక్కుగా మారారు అనడంలో సందేహం లేదు.  

 

టాలీవుడ్ లో ఏ విధమైన సమస్య వచ్చినా, విడుదల విషయంలో గొడవలు వచ్చినా, బిజినెస్ పరంగా సమస్యలు వచ్చినా చిరంజీవి తాను ఉన్నానంటూ ఇరు వైపులా సముదాయించి  గొడవను సర్దుబాటు చేస్తున్నారు. అంతేకాక ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలతో మమేకం అవుతున్న చిరు ప్రస్తుతం లాక్ డౌన్ నేపధ్యంలో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులకు అండగా కరోనా క్రైసిస్ ఛారిటీ పేరుతో ఒక స్వచ్చంద సంస్థను ఏర్పాటు చేసారు. తన వంతుగా కోటి రూపాయలు విరాళాన్ని అందించడమే కాక కోట్లాది విరాళాలను సేకరించి సినీ కార్మికులకు సాయం చేశారు.

 

ఇక పోతే తాజాగా చిరంజీవి షూటింగ్ లకు అనుమతి కోసం మంత్రి తలసాని తో మీటింగ్ ని తన స్వగృహంలో ఏర్పాటు చేసారు. ఈ మీటింగ్ కి సినీ ప్రముఖులందరూ హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్ గురించి ఒకరిద్దరు  నటులు పెడముఖంగా ఉన్నా మిగిలిన అందరు ఈ వయసులో కూడా ఎంతో ఓపికగా పెద్దరికం మీద వేసుకుని చిరంజీవి చేస్తున్న పనికి అభినందనలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి కొరటాల దర్శకత్వం లో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత మరికొన్ని ప్రాజెక్ట్ లను కూడా చిరు ఓకే చేసినట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: