టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలందరూ నిర్మాణ రంగంపై అడుగులు వేస్తున్నారు. అయితే ఇప్పటికే నందమూరి కుటుంబం, మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలు ఈ దిశగా అడుగులు వేస్తున్నారు. మెగా కుటుంబం నుండి చిరుత సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే కెరీర్ ప్రారంభంలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కున్నా మగ ధీర సినిమాతో  మంచి ఫాం లోకి వచ్చాడు. అయితే చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ తో రామ్ చరణ్ నిర్మాతగా మారాడు. 

 

చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో వచ్చిన ఖైదీ నెం 150 సినిమాకు కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో రాం చరణ్ నిర్మాతగా మొదటి సారి భారీ విజయాన్ని అందుకున్నాడు. తన తండ్రి కం బ్యాక్ మూవీస్ విజయాలతో లాభాలను తన ఎకౌంట్ లో వేసుకున్నాడు చరణ్. అయితే సైరా తో కాస్త ఇబ్బంది పడ్డాడు. తెలుగులో హిట్టయిన సైరా సినిమా మిగితా భాషల్లో పరాజయం పాలైంది. దీనితో చరణ్ ఈ సారి మాస్టర్ ప్లాన్ వేసినట్టు తెలుస్తుంది. చిరు, కొరటాల కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు నిరంజన్ రెడ్డి అనే మరొక నిర్మాతను రంగంలోకి దింపాడు. 

 

ఇక పోతే ఈ సినిమాకు గాను చిరంజీవి పారితోషికాన్ని కూడా అందుకోనున్నారు. అయితే ఈ సినిమాలో రాం చరణ్ కూడా నటిస్తారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనికి రాం చరణ్ పారితోషికం కూడా ఫిక్స్ అయ్యింది. చిరు పారితోషికం, చరణ్ పారితోషికం, మరియు లాభాల్లో వాటా ఇలా మూడు రకాలుగా చిరు, చరణ్ ఆచార్య సినిమాతో లాభపడనున్నారు. అయితే సినిమాలో పెట్టుబడులు పెట్టి లాభాలు వెనకేసుకున్నా జిఎస్టి పేరుతో చాలా వదిలించుకోవాలి. అందుకే చరణ్ ఈ రకమైన మాస్టర్ ప్లాన్ వేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: