హీరోలు పాటలు పాడటం అనేది ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా వింటున్నాం. చిన్న హీరోలు పెద్ద హీరోలు అందరూ కూడా పాటలు ఎక్కువగా పాడుతూ సందడి చేస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో పాటలు వాళ్ళు ఒకటో రెండో వాళ్ళు పాడితే మంచి గుర్తింపు వచ్చి సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది అనే సంగతి తెలిసిందే. ఇక మన తెలుగులో ఇప్పుడు కొందరు హీరోలు పాటలు మీద ఎక్కువగా ఫోకస్ చేసారు. ఇక ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ఇప్పటికే పాటలు పాడేసారు. ఇక కొందరు హీరోలు పాటలు పాడటానికి ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. 

 

తాజాగా ఎన్టీఆర్ కి కన్నడం లో ఒక ఆఫర్ వచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ ఒక పాటను కన్నడం లో పాడే అవకాశం ఉందని సమాచారం. ఎన్టీఆర్ ఆ పాటను ఒక స్టార్ హీరో సినిమాలో పాడే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో పునీత్ రాజ్ కుమార్ సినిమాలో ఆయన ఒక పాట పాడాడు. ఇప్పుడు ఆయన తమ్ముడి సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట పాడే అవకాశం ఉందని అంటున్నారు. త్వరలోనే ఆ పాటకు సంబంధించి ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా నటించే సూచనలు ఉన్నాయని కూడా అంటున్నారు. 

 

ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమా వచ్చే ఏడాది... ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఎప్పుడు విడుదల అవుతుంది అనేది నిర్మాతలు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి ఇప్పటి కే ఫాన్స్ లో ఒక క్రేజ్ అనేది వచ్చింది. మరి సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. కాగా ఈ సినిమా నిర్మాత దానయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి: